Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన

ABN , Publish Date - May 03 , 2024 | 11:00 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణను అధిక మోజార్టీతో గెలి పించాలని శుక్రవారం గూడెం, నంబాల, వెల్గనూర్‌, కాసిపేట, కొండాపూర్‌, ద్వారక, పెద్దపేట, లక్ష్మికాం తపూర్‌ గ్రామాల్లో ప్రచార సభలో ఎమ్మెల్యే మాట్లా డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన

దండేపల్లి, మే 3: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణను అధిక మోజార్టీతో గెలి పించాలని శుక్రవారం గూడెం, నంబాల, వెల్గనూర్‌, కాసిపేట, కొండాపూర్‌, ద్వారక, పెద్దపేట, లక్ష్మికాం తపూర్‌ గ్రామాల్లో ప్రచార సభలో ఎమ్మెల్యే మాట్లా డారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని అమలు చేశామని, ఎన్నికల కోడ్‌ అనంతరం మిగితావి అమలు చేసేం దుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలకు భరోసా కల్పించారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2లక్షల పంట రుణమాఫీ చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తు న్నారన్నారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే సబ్బండ వర్గా లకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం లో పదేళ్ల పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డు, ఇళ్లు ఇచ్చిన దాఖాలాలు లేవని విమర్శిం చారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపాలన్నారు. గడ్డం త్రిమూర్తి, వెంకటే శ్వర్లు, శ్రీనివాస్‌, మోహన్‌, మణేమ్మ, కమలాకర్‌, శ్రీనివాస్‌, రాజమౌళి పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:00 PM