Share News

బీసీల న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తాం

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:16 PM

బీసీల న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తామని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం అంబే ద్కర్‌ చౌరస్తాలో బీసీ చైతన్య యాత్రను బీసీ ఉద్యమ నాయకురాలు పేరం అలేఖ్య జెండా ఊపి ప్రారంభించారు.

బీసీల న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తాం

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7: బీసీల న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తామని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం అంబే ద్కర్‌ చౌరస్తాలో బీసీ చైతన్య యాత్రను బీసీ ఉద్యమ నాయకురాలు పేరం అలేఖ్య జెండా ఊపి ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కుల కోసం పోరాడే వారినే రాబోయే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారన్నారు. బీసీలు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న జనగణన ను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు అగ్రవర్ణాలకు అనుకూలమైన మనువాద ఎజెండాను అమలు చేస్తున్నార న్నారు. బీసీ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ వడ్డేపల్లి మనోహర్‌, నాయకులు మల్లయ్య, రంగు రాజేశం, చంద్రమౌళి, కోటిలింగం, శంకరయ్య, రాజన్న, సోమయ్య, భూమయ్య, అఖిల్‌, మల్లేష్‌, గణేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 10:16 PM