Share News

జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:14 PM

అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సీఈవో గణపతితో కలిసి స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు.

జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 11: అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సీఈవో గణపతితో కలిసి స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు. గ్రామీ ణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళ, శిశు సంక్షేమం, పౌరసరఫరాల శాఖ, మిషన్‌ భగీ రథ, రహదారులు, నీటి పారుదల తదితర అంశా లపై సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై జడ్పీటీసీలు అధికారులను నిల దీశారు. లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా సీఎం ఆర్‌ బియ్యంలో అవకతవకలు జరుగుతున్నా ఎం దుకు స్పందించడం లేదని వ్యవసాయాధికారులను నిలదీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. సదరం శిబి రాల్లో వైకల్యం ఉన్నా 25 శాతానికి మంచి వేయడం లేదన్నారు. ర్యాలీ గడ్‌పూర్‌ ఆదివాసీ గూడాల్లో పోడు భూములకు సంబంధించి న్యాయం చేయాల న్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ నిరుపేదలకు వైద్యం అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయా లన్నారు. పశు వైద్య రంగానికి సంబంధించి జడ్పీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ మాట్లాడుతూ పశువులకు వచ్చే లంపిస్కిన్‌ వ్యాధిని నివారించేం దుకు వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. వర్షాకా లంలో మత్య్సశాఖ అధికారులు చేపల పెంపకంపై ప్రణాళికబద్దంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పా టు చేసి మత్య్సకారులకు తోడ్పాడునందించాల న్నారు. బెల్లంపల్లిలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని అందుబాటులోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. వేమ నపల్లి జెడ్పీటీసీ స్వర్ణలత, హాజీపూర్‌ జెడ్పీటీసీ శిల్పలు మాట్లాడుతూ విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇంటర్‌ కళాశాలల కోసం మంజూరైన భవనాలను త్వరగా నిర్మించాలని కోరారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డం పింగ్‌యార్డులు, వైకుంఠధామాలు ప్రజలకు అందు బాటులో ఉండేలా చూడాలని కోరారు. డిప్యూటీ సీఈవో లక్ష్మీనారాయణ, సూపరిండెంటెంట్‌ వెంకటే శ్వర్లు, శ్రీనివాస్‌, బాల కిషన్‌రావు, శ్రీనివాస్‌, సుమిత్‌, వెంకటేష్‌, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

-వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో వైద్యాధికా రులు మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించాలని, వాటర్‌ ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయాలన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 10:14 PM