Share News

ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలి

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:15 PM

ఉగాది పండగను ప్రజ లందరు ఘనంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్‌ రాహు ల్‌ పేర్కొన్నారు. క్రోధి నామ సంవత్సర ఉగాది పండగను పురస్కరించుకుని సరస్వతి శిశుమందిర్‌ ఉన్నత పాఠశాల లో సాహితీ సంరక్షణ సమితి, సంగీత సాహిత్య సుధా వాహిని సంయుక్తంగా నిర్వహించిన ఉగాది స్వాగత కవి సమ్మేళనంలో మాట్లాడారు.

ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7: ఉగాది పండగను ప్రజ లందరు ఘనంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్‌ రాహు ల్‌ పేర్కొన్నారు. క్రోధి నామ సంవత్సర ఉగాది పండగను పురస్కరించుకుని సరస్వతి శిశుమందిర్‌ ఉన్నత పాఠశాల లో సాహితీ సంరక్షణ సమితి, సంగీత సాహిత్య సుధా వాహిని సంయుక్తంగా నిర్వహించిన ఉగాది స్వాగత కవి సమ్మేళనంలో మాట్లాడారు. సమాజాన్ని మేలుకొలపడం, చైతన్యవంతులను చేయడంలో కవుల పాత్ర ఎనలేనిద న్నారు. వామన్‌రావు, దాసరి శ్రీనాధ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

పంచాంగం ఆవిష్కరణ

ఏసీసీ: వైష్ణవ సేవా సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పంచాంగాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు ఆదివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేను వైష్ణవ సంఘం నాయకులు సన్మానించారు. సంఘం అధ్యక్షుడు గోవర్ధనగిరి అనంతాచార్యులు, ప్రధాన కార్యదర్శి వెంకట రమణచార్యులు , తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 10:15 PM