భూ సమస్యల పరిష్కారానికి కసరత్తు
ABN , Publish Date - Aug 26 , 2024 | 10:14 PM
నూతన ఆర్వోఆర్ చట్టం ద్వారా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీకావు. రైతుల ప్రమేయం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో తప్పులు దొర్లడంతో సమస్య జఠిలమైంది. రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు లక్షలాది మంది రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
మంచిర్యాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): నూతన ఆర్వోఆర్ చట్టం ద్వారా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీకావు. రైతుల ప్రమేయం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో తప్పులు దొర్లడంతో సమస్య జఠిలమైంది. రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులకు లక్షలాది మంది రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాతల కాలం నుంచి పట్టాగా ఉన్న భూములను ప్రభుత్వా నివంటూ ఎలాంటి నోటీసులు లేకుండానే నిషేధిత జాబి తాలో చేర్చడంతో అష్టకష్టాలు పెడుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ప్రతీ పనికీ కోర్టుకే...
ధరణి పోర్టల్‌లో తప్పొప్పుల సవరణకు ఇంతకాలం చట్టబద్దత లేకుండాపోయింది. సంబంధిత అధికారులకు అఽధికారాలను కట్టబెట్టకపోవడంతో సమస్యలు అపరిష్కృ తంగా మిగిలిపోయాయి. పేరు తప్పుబడినా, సర్వే నంబర్ మిస్ అయినా సిబ్బంది తప్పులకు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టుకు వెళ్లి ఆర్డర్ కాపీ తెచ్చుకోండని అధికారులు చెబుతున్నారు. ఽధరణి పోర్టల్, ఆర్వోఆర్ 2020 నిబంధనలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. చట్టాన్ని మార్చి రైతాంగానికి చిక్కులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నది. ఈ చట్టంపై ముందుగా రైతులకు అవగాహన కల్పించా లనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. అందుకు నూతన చట్టం లో పొందుపరిచిన 20 సెక్షన్లకు గాను 20 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రత్యేక కార్యాచరణను రూపొం దించింది. ప్రజాభిప్రాయ సేకరణలో తీసుకున్న అంశాలను సీసీఎల్‌ఏకు పంపిన అనంతరం చట్టం ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దరణి పోర్టల్, ఆర్వోఆర్ చట్టంలోని లొసుగులను సవరించి రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
భూ రికార్డుల నిర్వహణ
ధరణి పోర్టల్ పేరును రేవంత్ సర్కారు భూదేవి లేదా భూమాతగా మార్చాలని భావిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న భూ రికార్డుల నిర్వహణ పద్ధతులను పరిశీలించిన అనంతరం వ్యవసాయ, వ్యవసా యేతర భూములకు సంబంధించి వేర్వేరు రికార్డులు చేయాలనే నిశ్చయానికి ప్రభుత్వం వచ్చింది. భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లుపై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదు లు, ప్రజాప్రతినిధులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. భూ సేకరణలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించేలా మార్పులు తేవడంతోపాటు పట్టాదారు మృతి చెందిన పక్షంలో వారసత్వ భూముల బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేయనున్నారు. గ్రామాల్లో ఆబాదీ భూముల రికార్డులను ఆధునీకరించడం, సాదా బైనామా, భూముల రిజిస్ట్రేషన్ రుసుం వసూలు, ఈసీలో అనుభవదారుడి పేరిట కాలమ్ ప్రవేశపెట్టడం లాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. అప్పీల్ అథారిటీ ఆర్డీవోలకు అప్పగిం చేలా చర్యలు తీసుకోనున్నారు. భూ సమస్యల పరిష్కారా నికి జిల్లా స్థాయిలో అప్పిలేట్ అథారిటీ ఉండే విధంగా రూపకల్పన చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కు లకు నష్టం వాటిల్లకుండా చట్టాన్ని రూపొందించనున్నారు. నూతన ముసాయిదా చట్టం విధివిధానాలను ఇప్పటికే సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచగా, అవసర మైన మార్పులు, చేర్పుల కోసం 20 రోజుల పాటు ప్రజా భిప్రాయ సేకరణ చేపడుతున్నారు.
ఆర్వోఆర్‌లో తేడాలు....
అంశం 2020 2024
సవరణలు అవకాశం లేదు అవకాశం ఉంది
రిజిస్ట్రేషన్ తహసీల్దార్ తహసీల్దార్, డీటీ
మ్యూటేషన్ సెక్షన్ 5,6,7 సెక్షన్ 5,7,8 విచారణతో
సబ్‌డివిజన్ లేదు అవకాశం కల్పించారు
డాక్యుమెంట్ పాస్‌బుక్ పాస్‌బుక్
అప్పీల్ లేదు సెక్షన్ 14,15లతో ఏర్పాటు