Share News

భూదందాలకు పాల్పడితే సహించేది లేదు

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:11 PM

మండలంలో ఎవరైనా భూకబ్జా, ఇసుక దందాలకు పాల్పడితే సహిం చేది లేదని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నా రు. సోమవారం రైతువేదిక వద్ద 32 మంది లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

భూదందాలకు పాల్పడితే సహించేది లేదు

భీమారం, జూన్‌ 10: మండలంలో ఎవరైనా భూకబ్జా, ఇసుక దందాలకు పాల్పడితే సహిం చేది లేదని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నా రు. సోమవారం రైతువేదిక వద్ద 32 మంది లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ పేరు చెప్పుకుని వచ్చే వారిపై రెవెన్యూ, పోలీసు అధికారులు నిఘా ఉంచాలన్నారు. పార్టీ, తన పేరు, ఎంపీ పేరును వాడుకుని దందాలకు పాల్పడవద్దని పార్టీ నాయకులకు హెచ్చరించా రు. తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే పెద్ద సంఖ్యలో బోర్లు వేయించానని, అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశామ న్నారు. తహసీల్దార్‌ సదా నందం, ఆర్‌ఐ స్రవంతి, నాయకుడు చేకుర్తి సత్య నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు మోహ న్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, అనిల్‌, రమేష్‌, అమర్‌సింగ్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

పెద్దచెరువు సమస్య పరిష్కారం

చెన్నూరు: పెద్ద చెరువులో చేపల వేట కోసం ముదిరాజ్‌లు, గంగపుత్రుల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ముదిరాజ్‌ కుల స్తులు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామికి విన్నవించారు. ఎమ్మెల్యే మత్య్సశాఖ ఏడీని పిలి పించి మాట్లాడారు. గంగపుత్రులు, ముదిరాజ్‌ కులస్తులకు చెరువులో చేపలు వేటాడేందుకు ముదిరాజ్‌లకు సభ్యత్వం కల్పించాలని అధికారు లను ఆదేశించారు. ఎన్నో ఏండ్లుగా గంగపుత్రు లు, ముదిరాజ్‌ల మధ్య కొనసాగుతున్న చేపల వేట వివాదం ఎమ్మెల్యే చొరవతో ముగిసింది. సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేను ముదిరాజ్‌ కులస్తులు సన్మానించారు.

Updated Date - Jun 10 , 2024 | 10:11 PM