Share News

జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖరారు

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:41 PM

డిస్ర్టిక్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా టీచర్‌ ఉద్యోగాల భర్తీ కి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. గతనెల 29న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రకటించిన ఖాళీలకు అనుగుణంగా సోమవారం జిల్లాకు సంబంధించి సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు, రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్లను విద్యాశాఖ ప్రకటించింది.

జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖరారు

ఏసీసీ, మార్చి 4 : డిస్ర్టిక్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా టీచర్‌ ఉద్యోగాల భర్తీ కి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. గతనెల 29న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రకటించిన ఖాళీలకు అనుగుణంగా సోమవారం జిల్లాకు సంబంధించి సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు, రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్లను విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో మొత్తం 288 పోస్టులు ఉన్నాయి.

-ఖాళీల వివరాలు ఇలా...

స్కూల్‌ అసిస్టెంట్‌ , బయోలాజికల్‌ సైన్స్‌ తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1, లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 5, ఎస్సీ 2, ఎస్టీ 1, బీసీ ఏ 1, బీసీ బీ 1, వీహెచ్‌ 1, ఈడబ్య్లూఎస్‌ 1, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ 1 పోస్టులు. బయోలాజికల్‌ సైన్స్‌ఉర్దూ మీడియం లోకల్‌ బాడీ పాఠశాలల్లో వీహెచ్‌ 1 పోస్టు ఉంది.

-స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లీష్‌ లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 3, ఎస్సీ 1, బీసీ ఏ 1, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. స్కూల్‌అసిస్టెంట్‌ హిందీ ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1, లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 3, ఎస్సీ 1, బీసీ ఏ 1 పోస్టులు ఉన్నాయి.

స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథమేటిక్స్‌ తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1, లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1, బీసీ ఏ 1 , బీసీ బీ 1, వీహెచ్‌ 1 , ఈ డబ్ల్యూఎస్‌ 1 పోస్టులుఉన్నాయి. .

స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సూన్స్‌ తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్స్‌ సైన్స్‌ ఉర్దూ మీడియం లోకల్‌ బాడీ పాఠశాలల్లో బీసీ ఏ 1, స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ తెలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1, లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 7, ఎస్సీ 4,ఎస్టీ 2, బీసీ ఏ 2, బీసీ బీ 2, బీసీ సీ 1, బీసీ డీ 1, బీసీ ఈ 1, వీహెచ్‌ 1, ఈడబ్ల్యూఎస్‌ 2, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ 1 ఉన్నాయి.

స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఉర్దూ మీడియం లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఎస్సీ 1 ,స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 3, ఎస్సీ 1, బీసీ ఏ 1 పోస్టులు ఉన్నాయి.

స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ తెలుగు లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీలకు 3 పోస్టులు, ఎస్సీ 1, బీసీ ఏ 1 పోస్టులు ఉన్నాయి.

ఎస్‌జీటీ తెలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1, బీసీ ఏ 1, బీసీ బీ 1, వీహెచ్‌ 1, ఈడబ్ల్యూఎస్‌ 1 పోస్టులు ఉన్నాయి. ఎస్‌జీటీ తెలుగు లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 43, ఎస్సీ 23, ఎస్టీ 15, బీసీ ఏ 11, బీసీ బీ 14, బీసీ సీ 2, బీసీ డీ 10, బీసీ ఈ 6 , వీహెచ్‌ 2, హెచ్‌ఐ 4, ఓహెచ్‌ 1,ఎంఆర్‌ 1,ఈడబ్ల్యూఎస్‌ 15, స్పోర్స్ట్‌ కోటా 3, ఎక్స్‌సర్వీస్‌ మెన్‌ 4, మొత్తం 154 పోస్టులు ఉన్నాయి.

ఎస్‌జీటీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1, ఎస్సీ 1, వీహెచ్‌ 1 పోస్టులు ఉన్నాయి.

ఎస్‌జీటీ ఉర్దూ లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1, బీసీ ఏ 1, వీహెచ్‌ 1 పోస్టులు ఉన్నాయి.

ఎస్‌జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ తెలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ 1, ఎస్‌జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ తెలుగు లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 2, బీసీ ఏ1 , బీసీ బీ 1, బీసీ సీ 1, వీహెచ్‌ 1, ఈడబ్ల్యూఎస్‌ 1,ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ 1 పోస్టులు ఉన్నాయి.

లాంగ్వేజ్‌ పండిత్‌ హిందీ ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1 పోస్టు ఉంది. లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 3, ఎస్సీ 1,బీసీ ఏ 1 పోస్టులు ఉన్నాయి.

లాంగ్వేజ్‌ పండిత్‌ తెలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఓసీ 1 పోస్టు ఉంది. లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 3, ఎస్సీ 2, బీసీ ఏ 1, వీహెచ్‌ 1 పోస్టులు ఉన్నాయి.

లాంగ్వేజ్‌ పండిత్‌ ఉర్దూ లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 1,ఎస్సీ 1 పోస్టులుఉన్నాయి.

పీఈటీ తెలుగు ప్రభుత్వ పాఠశలల్లో ఓసీ 1 పోస్టు , లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 1 పోస్టు ఉంది.

పీఈటీ ఉర్దూ లోకల్‌ బాడీ పాఠశాలల్లో ఓసీ 1 పోస్టు ఉంది.

నిబంధనలు ఇవే...

ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే వారు వేరు వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఒక్కో పోస్టుకు దరఖాస్తు రుసుం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులకు 1-7-2023 నాటికి 18 నుంచి 46 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏండ్లు, పీహెచ్‌సీలకు 10 ఏండ్ల సడలింపు ఉంటుంది. అభ్యర్థి రాష్ట్రంలోని 11 పరీక్ష కేంద్రాల్లో ఏ కేంద్రాన్ని అయినా ఎంచుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. 95 శాతం పోస్టులను స్ధానికులకు రిజర్వు చేశారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయనవసరం లేదు.

-టెట్‌కు వెయిటేజీ

20 మార్కులకు టెట్‌ వెయిటీజీ, రాత పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు. ఒక ప్రశ్నకు అర మార్కు వంతున 160 ప్రశ్నలు ఉంటాయి. టెట్‌, రాత పరీక్ష మార్కులు కలిపి వంద మార్కులకు మెరిట్‌ జాబితా రూపొందించి కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించే డిస్ర్టిక్‌ సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు చేపడతారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్‌ చేసిన అభ్యర్ధులు అర్హులు. బీఈడీ, డీఈడీ రెండు చేసిన వారు రెండు రకాల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులకు బీఈడీ, డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.

Updated Date - Mar 04 , 2024 | 10:41 PM