Share News

విష జ్వరాల వ్యాప్తిని నియంత్రించాలి

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:12 PM

వర్షాకాలంలో విష జ్వరాల వ్యాప్తిని నివారించేం దుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నా రు. హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమావేశం నిర్వ హించారు.

విష జ్వరాల వ్యాప్తిని నియంత్రించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 10: వర్షాకాలంలో విష జ్వరాల వ్యాప్తిని నివారించేం దుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నా రు. హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమావేశం నిర్వ హించారు. మంత్రి మాట్లాడు తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అతిసార, కలరా, టైఫాయిడ్‌, మలేరి యా, డెంగ్యూ ఇతర వ్యాధులు నియం త్రించేందుకు చర్యలు చేపట్టా లన్నారు. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా లార్వాదశలోనే నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు. వాటర్‌ ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు అవసరమైన వైద్య సేవలందించాల న్నారు. అదనపు కలెక్టర్‌ రాహుల్‌, వైద్య ఆరోగ్య శాఖ , తదితర అధికారులు పాల్గొన్నారు.

నల్లా కనెక్షన్‌ సర్వే పూర్తిచేయాలి

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకానికి సంబంధించి ఇంటింటి నల్లా కనె క్షన్‌ల సర్వే ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయా లని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో మిషన్‌ భగీరథ ఈఈ వెంక టేశ్వర్లుతో కలిసి సమావేశం నిర్వహించారు. అద నపు కలెక్టర్‌ మాట్లాడుతూ నల్లా కనెక్షన్‌ల సర్వేను మొబైల్‌ యాప్‌ ద్వారా 10 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నల్లా కనెక్షన్‌లు కలిగిన నివాసాలు, ఇవ్వాల్సిన కనెక్షన్‌లు, నూతనం గా నిర్మించిన ఇండ్లకు ఇవ్వాల్సిన కనెక్షన్ల వివరాలతో కూడిన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. సర్వే ప్రక్రియలో ఇంటింటికి వెళ్లి ఇంటి యజమా నితోపాటు కుటుంబ సభ్యుల ఆధార్‌ నెంబర్లు, కు లం, సెల్‌నెంబర్‌, నీటి సరఫరాకు సంబంధించి ఫొటోలను యాప్‌లో పొందుపర్చాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, అదనపు పంచాయతీ అధికారి, ట్రైనీంగ్‌ రీసోర్స్‌ పర్సన్‌లు మల్లేష్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 10:12 PM