Share News

నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి

ABN , Publish Date - May 21 , 2024 | 10:27 PM

ధాన్యాన్ని కొను గోలు ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేసే విధం గా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ అధికారి కృష్ణఆదిత్య పేర్కొ న్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంచిర్యాల, కుమరంభీంఆసిపాబాద్‌ జిల్లా కలెక్టర్‌లు బదావత్‌ సంతోష్‌, వెంకటేష్‌ ధోత్రే, అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, మోతిలాల్‌, దాసరి వేణులతో కలిసి సమావేశం నిర్వహించారు.

నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 21: ధాన్యాన్ని కొను గోలు ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేసే విధం గా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ అధికారి కృష్ణఆదిత్య పేర్కొ న్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంచిర్యాల, కుమరంభీంఆసిపాబాద్‌ జిల్లా కలెక్టర్‌లు బదావత్‌ సంతోష్‌, వెంకటేష్‌ ధోత్రే, అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, మోతిలాల్‌, దాసరి వేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసిందని, నాణ్యమైన ధాన్యం రైతు ల నుంచి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిం చాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ, తాగునీరు, ఇతర సదుపాయాలతోపాటు ఓఆర్‌ఎస్‌, మెడికల్‌ కిట్‌లు అందుబాటులో ఉంచాలని తెలి పారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకోవ డానికి అవసరమైన టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోళ్ల వివరాలను రిజిష్టర్లలో నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రానికి కేటా యించిన లక్ష్యం వంద శాతం పూర్తయితే వివరాలు సమర్పించి ఆ కేంద్రాన్ని మూసివేయాలని, ఆ కేంద్రంలోని సామగ్రిని అవసరం ఉన్న కేంద్రాలకు తరలించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యా న్ని రైస్‌మిల్లులకు తరలించాలని తెలిపారు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభి వృద్ధి శాఖ ఆద్వర్యంలో 136, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 89, మెప్మా ఆధ్వ ర్యంలో 10, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 51 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామ న్నా రు. ఆర్డీవోలు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి

నస్పూర్‌: ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరిం త వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌ కృష్ణ అదిత్య ఆదేశించారు. నస్పూర్‌ పట్టణం సీతారాంపల్లి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ బదావంత్‌ సంతోష్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ గోపాల్‌లతో కలిసి తనిఖీ చేశారు. కేంద్రంలో కొనుగోలు చేసిన, చేయాల్సిన వివరాలను తెలుసుకు న్నారు. సత్వరమే కొనుగోలును చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. బెల్లంప ల్లి ఆర్డీవో. ఇన్‌చార్జి పౌరసరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ సంతోష్‌, కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.

జైపూర్‌: ధాన్యం కొనుగోలు ప్రక్రి యను త్వరగా పూర్తి చేసే విధం గా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. రామా రావుపేట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌తో కలిసి తనిఖీచేశారు. ట్యాగింగ్‌ చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాలన్నారు.

Updated Date - May 21 , 2024 | 10:27 PM