ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 10:04 PM
ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్క రించాలని టీఎన్‌జీవో కేంద్ర సం ఘం అధ్యక్షుడు మారం జగ దీశ్వర్ అన్నారు. శనివారం టీఎన్ జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెం డింగ్‌లో ఉన్న 4 డీఏలను ప్రక టించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లని, ఆమోదయోగ్యమైన శాతంతో పీఆర్‌సీని వెం టనే ఇవ్వాలన్నారు.
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 24: ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్క రించాలని టీఎన్‌జీవో కేంద్ర సం ఘం అధ్యక్షుడు మారం జగ దీశ్వర్ అన్నారు. శనివారం టీఎన్ జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెం డింగ్‌లో ఉన్న 4 డీఏలను ప్రక టించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లని, ఆమోదయోగ్యమైన శాతంతో పీఆర్‌సీని వెం టనే ఇవ్వాలన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లిం చాలని, 317 జీవో వల్ల నష్టపోయిన ఉద్యోగులను స్థానిక జిల్లాలకు పంపించాలని, లేకుంటే సెప్టెం బర్ 1న ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన బదిలీల్లో మిగిలిన స్పౌజ్, ఇతర ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రతీనెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్య క్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, పిఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య పాల్గొన్నారు.