Share News

ఆన్‌లైన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:13 PM

ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీక రించిన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేప ట్టాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ మారుతి ప్రసాద్‌తో కలిసి ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను పరిశీలించారు.

ఆన్‌లైన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

ఏసీసీ, జనవరి 9: ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీక రించిన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేప ట్టాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ మారుతి ప్రసాద్‌తో కలిసి ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు అందించిన దరఖాస్తు ఫారాల్లో పొందుపర్చిన సమాచారాన్ని ఆన్‌ లైన్‌లో నమోదు చేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. దరఖాస్తుల వివరాలను 17వ తేదీ లోగా ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఆన్‌లైన్‌ నమోదుపై ఇది వరకే తహసీల్దార్‌, వార్డు అధికారులు, ఎంపీడీవోలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు.

నస్పూర్‌: ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ర్టేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నారాయణ అన్నారు. నస్పూర్‌ మున్పి పాలిటీ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. మున్సిపాలిటీలో ఎన్ని దరఖాస్తులు వచ్చా యని, ఇప్పటి వరకు ఎన్ని ఆన్‌లైన్‌ చేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పనులు పూర్తి చేయా లని అధికారులను జేడి ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేష్‌, ఆర్‌ఓ సతీష్‌ సిబ్బంది ఉన్నారు

కాసిపేట: అభయహస్తంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ నమోదును పరిశీలిం చారు. తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని సూచించారు. తహసీల్దార్‌ భోజన, ఎంపీడీవో ఆలీం, ఎంపీవో నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 10:13 PM