ఎంసీహెచ్‌కు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:07 PM
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలంలో మాతా శిశు సంరక్షణ కేంద్రా నికి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకు స్థాపన చేయించనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు.

మంచిర్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలంలో మాతా శిశు సంరక్షణ కేంద్రా నికి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకు స్థాపన చేయించనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. శుక్రవారం విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ గోదావరి సమీపంలో మాతా శిశు ఆస్పత్రి నిర్మించడం వల్ల మహిళలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఫ్లై ఓవర్‌పై పెద్ద పెద్ద గుంతల ఏర్పడడంతో అత్యవసరంగా తారు రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. శ్రీనివాస గార్డెన్ నుంచి ఐబీ చౌరస్తా మీదుగా తోళ్లవాగు వంతెన వరకు ఫోర్‌లేన్ రోడ్డును త్వరలో ప్రారంభిస్తామన్నారు.
సంక్రాంతి పండుగ నుంచి మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట ప్రజలకు రోజు రెండు గంటల పాటు నీటి సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంచిర్యాల, నస్పూర్‌లో ఈనెల 14న, లక్షెట్టిపేటలో 15న ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే భగీరథ నీటిని మూడు సార్లు టెస్టింగ్ కోసం హైద్రాబాద్‌కు పంపామని, నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీరు తాగేందుకు యోగ్యమైందని తేలిందన్నారు. మంచినీటి ప్రారంభోత్సవాలకు మహిళలకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
రాముడు బీజేపీ సొంతం కాదు...
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం బీజేపీకి సొంతం కాదని ఎమ్మెల్యే అన్నారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయ మన్నారు. రాముడు ప్రపంచంలోని ప్రతి హిందు వుకు ఆరాధ్య దైవమన్నారు. కాంగ్రెస్ హిందువులకు, రామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే కుట్రకు బీజేపీ తెరలేపిందన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక హిందూ దేవా లయాలు, శ్రీరాముని ఆల యాలు నిర్మాణం జరి గాయన్నారు. ప్రతి విష యాన్ని బీజేపీ ఓట్ల దృష్టి తోనే చూస్తోందని, కేసీఆర్ సైతం ఇదే తరహాలో ఉం డగా ప్రజలు బుద్ధి చెప్పా రని గుర్తు చేశారు. పార్ల మెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి తన వంతుగా రూ.3,69,999 విరా ళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 18 నుంచి జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాలలో ఐదు రోజుల పాటు రామ భజన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నాయకులు సురిమిళ్ల వేణు, శ్రీనివాస్, బండారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.