Share News

భూమి అప్పగించాలని బాధితుల ఆందోళన

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:13 PM

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేచిని గ్రామపంచాయతీ పరిధిలోని బారేపల్లి గ్రామస్థులు మంగళవారం తమకు కేటాయించిన భూమి అప్పగించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆదె శ్రీనివాస్‌ అనే యువకుడు న్యాయం చేయాలని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నిం చాడు.

భూమి అప్పగించాలని బాధితుల ఆందోళన

తాండూర్‌, ఏప్రిల్‌ 2: మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేచిని గ్రామపంచాయతీ పరిధిలోని బారేపల్లి గ్రామస్థులు మంగళవారం తమకు కేటాయించిన భూమి అప్పగించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆదె శ్రీనివాస్‌ అనే యువకుడు న్యాయం చేయాలని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నిం చాడు. రెవెన్యూ సిబ్బందితోపాటు అక్కడే పెట్రోలింగ్‌ విధులు నిర్వహి స్తున్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ గమనించి సంఘటన స్థలానికి వచ్చి ఆత్మహత్యా యత్నాన్ని విరమింపజేశారు.

బాధితులు మాట్లాడుతూ బారేపల్లి గ్రామంలో 2007లో అప్పటి కాం గ్రెస్‌ ప్రభుత్వం 60 మంది పేదలకు ఇంటి నిర్మాణానికి స్థలాలు కేటాయిం చిందన్నారు. స్థలాలను గ్రామానికి చెందిన సుబ్బ దత్తుమూర్తికి చెందిన సర్వే నెంబరు 41/అలో నుంచి ఎకరం 17 గుంటలు, డోకె లక్ష్మీకి చెందిన సర్వే నెంబరు 45/అలో నుంచి ఎకరం 25 గుంటల భూమి సేకరించి వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందన్నారు. సేకరించిన భూమిలో 60 ప్లాట్లు చేసి పేదలకు అందజేశారన్నారు. కానీ ఆ స్థలంలో ఇండ్లు నిర్మించుకోలేదన్నారు. తాండూర్‌ మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సింగిల్‌విండో చైర్మన్‌ సుబ్బ దత్తుమూర్తి ప్రభుత్వానికి అప్పజెప్పిన భూమి ని రాజకీయ పలుకుబడితో ధరణి పోర్టల్‌లో తిరిగి అతడి పేరుపై రిజి స్ర్టేషన్‌ చేయించుకున్నాడని, రైతుబంధు సైతం పొందుతున్నాడన్నారు. సుబ్బ దత్తుమూర్తి ఫ్లెక్సీతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దత్తుమూర్తి అక్రమంగా చేయించుకున్న పట్టాను రద్దు చేసి ప్రభుత్వం తమకు భూమి ని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా భూమిని పట్టా చేయిం చుకున్న దత్తుమూర్తిపై, సహకరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బాధితులు ఆందోళన చేస్తున్న సమయంలో తహసీల్దార్‌ బెల్లంపల్లిలో సమావేశానికి వెళ్లగా సిబ్బంది ఫోన్‌ ద్వారా విషయం తెలిపారు. విచారణ చేపడతానని, న్యాయం జరిగేలా చూస్తానని, సిబ్బందికి వినతిపత్రం ఇవ్వా లని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జగదీష్‌గౌడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఆందోళనలు చేపట్టవద్దని సూచించారు. సమస్యలుంటే అధికారులకు విన్నవించాలని, ఆత్మహత్యాయత్నం లాంటివి చేయవద్దని హెచ్చరించారు. బాధితులు కార్యాలయంలో వినతిపత్రం అందించి వెళ్లిపోయారు.

Updated Date - Apr 02 , 2024 | 10:13 PM