Share News

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:36 PM

పెద్దపల్లి పార్టమెంట్‌ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ కోరారు. గోదావరి కాలనీలో శుక్రవారం రఘునాథ్‌ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

నస్పూర్‌, ఏప్రిల్‌ 19: పెద్దపల్లి పార్టమెంట్‌ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ కోరారు. గోదావరి కాలనీలో శుక్రవారం రఘునాథ్‌ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట ప్రజ లను మభ్యపెట్టి అధికా రంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని రఘునాథ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను అ మలు చేయాలని డిమాం డ్‌ చేశారు. పార్లమెంట్‌ నియో జకవర్గంలో దళితులు లేనట్టుగా ఒకే కుటుం బానికి రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు కేటాయించి మిగతా దళితులను అవమానిం చారని ఆరోపించారు. నాయకులు కమలాకర్‌ రావు, మధు, కుర్ర చక్రి, ఈర్ల సదానందం, కొయ్యాడ పద్మ, అనూష, మౌనిక, జ్యోతి, మహేందర్‌ పాల్గొన్నారు.

దండేపల్లి: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అధికా రంలోకి రావడం ఖాయమని పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు గోపతి రాజయ్య, ఎంబడి సురేందర్‌, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు అక్కల దివ్య లు ధీమా వ్యక్తం చేశారు. మామిడిపల్లి, కాసిపేట, చింతపల్లి గ్రామాల్లో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ను గెలిపిం చాలని కోరారు. బీజేపీ అధికారంలో ఉంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. నాయ కులు పత్తిపాక సంతోష్‌, గాలిపెల్లి సత్యనారాయణ, నలిమెల మహేష్‌, యుగేందర్‌, దయ్యాల వెంకటేష్‌, శ్యామల స్వామి, లచ్చన్న, రాజేష్‌, శ్రీధర్‌, సుమన్‌, తదితరులు పాల్గొన్నారు.

చెన్నూరు: మండలంలోని రాయిపేటలో బీజేపీ నాయకులు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్ధి గోమాస శ్రీని వాస్‌ను గెలిపించాలని ప్రచారం చేశారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. బూత్‌ అధ్యక్షుడు రాజ్‌కు మార్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 10:36 PM