మా బాధలు పట్టించుకోండి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:17 PM
కనీస సౌకర్యాలు లేక ఇక్కట్ల పాలవుతున్నామని కోనంపేట గ్రామస్థులు సోమవా రం నిరసనకు దిగారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు లేక పడరాని పాట్లు పడుతున్నామని, ఎన్ని సార్లు చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదని రామటెంకి శ్రీనివాస్ పేర్కొన్నారు.

నెన్నెల, జూలై 8: కనీస సౌకర్యాలు లేక ఇక్కట్ల పాలవుతున్నామని కోనంపేట గ్రామస్థులు సోమవా రం నిరసనకు దిగారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు లేక పడరాని పాట్లు పడుతున్నామని, ఎన్ని సార్లు చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదని రామటెంకి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకాక పోవడంతో సబ్ సెంటర్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఎంత చెప్పిన టీచర్లు, వైద్య సిబ్బంది పనితీరులో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుశ్నపల్లి వైపు బ్రిడ్జీలు నిర్మించి అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నా యన్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడు తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించు కోవడం లేదన్నారు. యూపీఎస్‌లో కొనసాగు తున్న జీపీ కార్యాలయాన్ని సొంత భవనంలోకి తరలిం చాలని కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. గ్రామ స్థులతో నోడల్ అధికారి ప్రకాష్‌రావు సమావేశ మయ్యారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, టీచర్లు సక్రమంగా విధులకు హాజరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.