Share News

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:23 PM

లోక్‌ అదాలత్‌ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా ప్రధాన, సెషన్స్‌ జడ్జి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాం ప్లెక్స్‌లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు.

 లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

ఏసీసీ, జూన్‌ 8: లోక్‌ అదాలత్‌ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా ప్రధాన, సెషన్స్‌ జడ్జి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాం ప్లెక్స్‌లో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించు కుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచిం చారు. లోక్‌ అదాలత్‌ తీర్పు అంతిమ తీర్పు అని అద నపు సీనియర్‌ సివిల్‌ జడ్జి అర్పితరెడ్డి అన్నారు. జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి కోర్టుల్లో లోక్‌అదాలత్‌ నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 4462 కేసులతోపాటు 46 బ్యాంకు కేసుల్లో రాజీ కుదరగా రూ.86,43,245లు సెటిల్‌మెంట్‌ జరిగిందన్నారు. వీటితో పాటు సైబర్‌ క్రైంకు సంబంధించి 11 కేసుల్లో రూ.1.30 లక్షల సెటిల్‌మెంట్‌ జరిగిందన్నారు. ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సంపత్‌, జుడిషియల్‌ మెజిస్ర్టేట్‌ నిరోషా, బ్యాంకు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదు లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

చెన్నూరు: చెన్నూరు పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జడ్జి పర్వతపు రవి ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ సభ్యు లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 10:23 PM