Share News

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:25 PM

నకిలీ విత్తనాలు విక్ర యిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వాటి పై ప్రత్యేక నిఘా పెడు తామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. శని వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు.

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా

భీమిని, ఫిబ్రవరి 17: నకిలీ విత్తనాలు విక్ర యిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వాటి పై ప్రత్యేక నిఘా పెడు తామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. శని వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు.5ఎస్‌ అమ లు తీరును గమనించారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, నమోదైన కేసుల వివరాలు పరిశీలించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టకొని ప్రణాళికలతో పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. గుడుం బా, గంజాయి, నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయా లన్నారు. సీఐ శ్రీనివాస రావు, ఎస్సై ప్రశాంత్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఓదెలు, రైటర్‌ రాజ్‌ కుమార్‌ సిబ్బంది ఉన్నారు.

పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ చేసిన ఏసీపీ

నెన్నెల: ఏసీపీ రవికుమార్‌ నెన్నెల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్‌ ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది వివరాలు, కేసుల నమోదుపై ఎస్సై శ్యామ్‌పటేల్‌ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి సల హాలు, సూచనలు ఇచ్చారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదుల కోసం వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెదలాలని సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బెల్లంపల్లి రూరల్‌, తాండూరు సీఐలు అఫ్జలుద్దీన్‌, శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 10:25 PM