ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:24 PM
ప్రభుత్వం ప్రవే శపెట్టిన ఆరు గ్యారంటీల ఆవశ్యకతతోపాటు మూడు నెలల్లో చేపట్టిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ లెవల్ నాయకులపై ఉందని ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి తెలిపారు.
మందమర్రి టౌన్, మార్చి 3: ప్రభుత్వం ప్రవే శపెట్టిన ఆరు గ్యారంటీల ఆవశ్యకతతోపాటు మూడు నెలల్లో చేపట్టిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ లెవల్ నాయకులపై ఉందని ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి తెలిపారు. శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన బూత్ లెవల్ నాయ కుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి తాను రుణపడి ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నిక లను కూడా చాలెంజ్‌గా తీసుకొని పని చేయా ల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో 15 సీట్లలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఆయా బూత్‌లలో అధిక ఓట్లు రాబట్టే విధంగా పని చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి సమస్య లు ఉన్నా తాను స్పందిస్తానని తెలిపారు. ఎవరు ఫోన్ చేసినా వారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే మందమర్రిలో నాయకుల, కార్యకర్తల సమా వేశాలు నిర్వహిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్ని కల్లో ఏ విధంగా పని చేశారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాగే పని చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రజాహిత కార్యక్ర మాలను వివరించాలని పేర్కొన్నారు. నాయ కులు గుడ్ల రమేష్, సొత్కు సుదర్శన్, దుర్గం నరేష్, మహంత్ అర్జున్, ఇసాక్, నర్సింగ్, జావేద్‌ఖాన్, కడారి శ్రీనివాస్, పోలు శ్రీనివాస్, మంద తిరుమల్, కాసర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.