Share News

సింగరేణి కార్మికుల ఇన్‌కంటాక్స్‌ తిరిగి చెల్లిస్తాం

ABN , Publish Date - May 03 , 2024 | 11:06 PM

సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి చెల్లించిన ఆదాయ పన్నును తిరిగి చెల్లించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని, త్వరలోనే ప్రకటన చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు.

సింగరేణి కార్మికుల   ఇన్‌కంటాక్స్‌ తిరిగి చెల్లిస్తాం

ఏసీసీ, మే 3: సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి చెల్లించిన ఆదాయ పన్నును తిరిగి చెల్లించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని, త్వరలోనే ప్రకటన చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవా రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫస్ట్‌, సెకం డ్‌ ఫేజ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి ముం దంజలో ఉందని, దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఽధీమా వ్యక్తం చేశారు. ఏఐటీ యూసీ నాయకులు పార్లమెంట్‌ అభ్యర్థి వంశీకి మద్దతుగా చేస్తున్న ప్రచా రానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.

తెలంగాణ ఏర్పడే నాటికి సింగరేణిలో 62 వేల ఉద్యోగాలు ఉండగా నేడు అవి 32 వేలకు తగ్గాయన్నారు. సింగరేణి నిధుల నుంచి రూ.20 వేల కోట్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కదారి పట్టించినా బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. సింగరేణి కార్మికు ల సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని, కార్మికుల ఇన్‌ కంటాక్స్‌ రీయింబర్స్‌మెంట్‌ కు సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని, ఎన్నికల కోడ్‌ అయిపోగానే ప్రకటన చేస్తారన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ సింగరేణి కార్మికులకు చేసిందేమి లేదని, సింగరేణిలో 23 వేల ఉద్యోగాలు తొలగిస్తే కార్మికుల తరుపున ఏనాడు మాట్లాడలేదని విమర్శిం చారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్ధానికులకే కల్పిస్తామన్నారు. మందమర్రిలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు నైపుణ్యాలను పెంపొందిస్తున్నామన్నారు. కార్మికులకు బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం, కొప్పుల ఈశ్వర్‌ ఏం చేశారని ప్రశ్నించారు.

పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ సింగరేణి ద్రోహి కేసీఆర్‌ అన్నారు. పదేండ్లుగా సింగరేణి సంస్థ, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడు పట్టించు కోలేదన్నారు. కార్మికుల సొంతింటి నిర్మాణానికి ఒక్కో కార్మికునికి రూ.10 లక్షలు, భూమి కేటాయిస్తామని చెప్పి అనంతరం స్థలం లేదని కార్మికు లను మోసగించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అమ్మిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణికి అన్యాయం చేసిందన్నారు. కార్మికుల ఆదాయ పన్ను పరిమితులు పెంచా లని డిమాండ్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల క్వార్టర్లను కార్మికులకు ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ నాయకులకు అక్రమంగా కేటాయించారన్నారు. కాంగ్రెస్‌ మాటిస్తే అమలు చేసే పార్టీ అని, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు పర్మినెంటు కార్మికులకు ప్రమాద బీమా కోటి రూపాయలు అమలు చేయడంతోపాటు కాంట్రాక్టు కార్మికులకు ప్రమాద బీమా రూ.25 లక్షలు అందించే పథకం కూడా అమలవు తుంద న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టగానే మొట్ట మొదట కార్మికుల ప్రమాదాల బీమా పథకాన్ని అమలు చేశారన్నారు. పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు ఒక్క ఇంక్రిమెంటు కూడా పెంచలేదన్నారు. ఈ ప్రాంత సింగరేణి కార్మికులకు కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరిఖనిలో సిం గరేణి కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించామన్నారు.

సింగరేణి మూతపడే సమయంలో కాకా వెంకటస్వామి సంస్థను మూత పడకుండా కాపాడి లక్ష మంది ఉద్యోగులు రోడ్డున పడకుండా ఆదుకున్నారన్నారు. జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ ఈ ప్రాంతంలో ఏర్పాటు కావ డానికి, రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం కావడానికి వెంకటస్వామి, వివేక్‌ల కృషే కారణమన్నారు. ఏఐటీయూసీ జనరల్‌ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, టీజేఎస్‌ నాయకుడు బాబన్న, ఐఎన్‌టీ యూసీ సెక్రెటరీ జనరల్‌, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, సీనియర్‌ జర్నలిస్టు ఎండీ మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:06 PM