Share News

ఊరూరా సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:53 PM

జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు తరలివచ్చారు. ఆలయాల ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛావాల మధ్య శ్రీరాముడి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సాయంత్రం శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.

ఊరూరా సీతారాముల కల్యాణం

ఏసీసీ, ఏప్రిల్‌ 17: జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి పర్వ దినాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పాత మంచిర్యాల రామాలయం, శివాలయంలో నిర్వహించిన కల్యాణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పాల్గొ న్నారు. ఆలయానికి రూ.2 లక్షలు విరాళంగా ప్రకటించి లక్ష రూపాయల నగదు అందించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఉప్ప లయ్య, తిరుపతి, చంద్రశేఖర్‌, సునీతకిషన్‌ పాల్గొన్నారు. గౌతమినగర్‌లోని కోదండరామాలయం, విశ్వనాథ ఆలయా ల్లో నిర్వహించిన కల్యాణంలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పాల్గొన్నారు. పాతమంచిర్యాలలో నిర్వహించిన కల్యాణా నికి మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పట్టువస్ర్తాలు, తలం బ్రాలు సమర్పించారు. దివాకర్‌రావు సతీమణి రాజకుమారి, తనయుడు విజిత్‌రావు, పెంట రాజయ్య పాల్గొన్నారు. విశ్వనాథ ఆలయంలో బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్‌, దివాకర్‌ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ పాల్గొన్నారు. మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో పెద్దపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్ధి గోమాసశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మంచిర్యాల ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేంసాగర్‌రావు గెలి స్తే పాతమంచిర్యాలలోని రామాలయం శివాలయం, భక్తాం జనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహా నికి వెండి తొడుగు, టైల్స్‌ అందిస్తామని కాంగ్రెస్‌ పట్టణా ధ్యక్షుడు తూముల నరేష్‌జమునరాణి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ తూముల వెంకటేష్‌స్రవంతిలు మొక్కుకు న్నారు. బుధవారం ఎమ్మెల్యే సమక్ష్యంలో వాటిని అందించారు.

బెల్లంపల్లి: పట్టణంలోని కోదండరామాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం ఘనంగా జరి గింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వెంకటస్వామి దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కోదండరామాలయంలో జరిగిన కల్యాణంలో మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైల్వే కాలనీలోని రామాలయంలో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు.

జైపూర్‌: హనుమాన్‌ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వివేక్‌ దంపతులు హాజరై తాళి, మట్టెలు అందజే శారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

నస్పూర్‌: నస్పూర్‌, సీసీసీ, గోదావరి కాలనీ, నస్పూర్‌ కాలనీ, తీగల్‌పహాడ్‌, వినూత్న కాలనీ, ప్లడ్‌ కాలనీ కళ్యాణ మహోత్సవాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీలు దర్శించుకున్నారు. పలు ఆలయాల్లో కల్యాణాలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ దర్శించారు. నాగార్జునకాలనీ వెంకటే శ్వర దేవాలయంలో నిర్వహించిన కల్యాణంలో శ్రీరాంపూర్‌ జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌రెడ్డితోపాటు పలువురు అధికా రులు పాల్గొన్నారు. కల్యాణం సందర్భంగా అన్నదానాలు జరిగాయి.

మందమర్రిటౌన్‌: పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగాయి. మూడో జోన్‌ లోని సీతారాముల ఆలయంలో ఏర్పాటు చేసిన మండపం వద్దకు విగ్రహాలను తీసుకువచ్చారు. పెండ్లి పెద్దలుగా కేకే 5గని రక్షణాధికారి రమేష్‌ దంపతులు, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ దంపతులు వ్యవహరించారు. ఎమ్మెల్యే దంపతులు పట్టువస్ర్తాలు సమ ర్పించారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన కల్యాణంలో ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. యాపల్‌ ఏరియాలోని పంచముఖ ఆంజనేయ ఆలయం, కోదండరామాలయంలో కల్యాణానికి హాజరై పట్టు వస్ర్తాలు సమర్పించారు. మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్లి కళ్యాణానికి హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు బండి సదానందం యాదవ్‌ ఎమ్మెల్యే వివేక్‌ దంపతులను సన్మానించారు. మూడో జోన్‌లోని సీతారామ ఆలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు కల్యాణానికి హాజరయ్యా రు. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన కల్యాణంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పాల్గొన్నారు. సీతారాములకు తలంబ్రాలు అందించారు.

Updated Date - Apr 17 , 2024 | 10:53 PM