Share News

అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి పథకాలు అందించాలి

ABN , Publish Date - May 24 , 2024 | 10:19 PM

ప్రజల సంక్షేమా నికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన వారి కి అందేలా అధికార యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు.

 అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి పథకాలు అందించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 24: ప్రజల సంక్షేమా నికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన వారి కి అందేలా అధికార యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌ రావు, రీజనల్‌ మాస్టర్‌ ట్రైనర్‌ ప్రభాకర్‌ స్వామితో కలిసి అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 24 తేదీ వరకు పాత బెల్లంపల్లి, తిమ్మాపూర్‌, మాదారం, గుల్లకోట, దొనబండ గ్రామాల్లో ప్రజల స్థితిగతులు, ప్రభుత్వ పథకాల అమలుపై కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పరిశీలించారన్నారు. వారి నుంచి పథకాల సంబంధిత వివరాలు, చేయా ల్సిన మార్పులు, తీసుకోవాల్సిన చర్యల వివరాలను స్వీకరించామన్నారు. ప్రకృతి వనాల్లోని మొక్కల సం రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా పల్లెలకు మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తు న్నామని, మరమ్మతు సమయంలో తప్ప నిరంతరం విద్యుత్‌ సరఫరా జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 10:19 PM