Share News

సరదాల సంక్రాంతి

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:08 PM

పంట రాశులు.. వేకువజామునే హరినామ కీర్తనలతో హరిదాసులు... డూడూ బసవన్నలు... రంగురంగుల రంగవల్లులు.. గొబ్బెమ్మల కనువిందు.. యువతుల కోలహాలు.. గాలిప టాలు.. పిండివంటలు వెరసి.. లక్ష్మీదేవికి స్వాగతం పలికే శుభఘడియాలతో సంక్రాంతి పండుగ రానే వచ్చింది. పండిన పంట చేలు తెచ్చిన దిగుబడిలతో రైతుల కళ్లలో కనిపించే కొత్త కాంతికి సిసలైన ప్రతీక సంక్రాంతి.

సరదాల సంక్రాంతి

నస్పూర్‌/దండేపల్లి, జనవరి 14: పంట రాశులు.. వేకువజామునే హరినామ కీర్తనలతో హరిదాసులు... డూడూ బసవన్నలు... రంగురంగుల రంగవల్లులు.. గొబ్బెమ్మల కనువిందు.. యువతుల కోలహాలు.. గాలిప టాలు.. పిండివంటలు వెరసి.. లక్ష్మీదేవికి స్వాగతం పలికే శుభఘడియాలతో సంక్రాంతి పండుగ రానే వచ్చింది. పండిన పంట చేలు తెచ్చిన దిగుబడిలతో రైతుల కళ్లలో కనిపించే కొత్త కాంతికి సిసలైన ప్రతీక సంక్రాంతి.

మనిషి జీవనయానం ప్రకృతి ఆరాధనతోనే ప్రారంభమైంది. ప్రకృతిలోని శక్తులను పూజించడం, దైనందిన జీవితాన్ని కొనసాగించడం ఆనాదిగా వస్తోంది. ఆచార సంప్రదాయాల నుంచి వచ్చినవే పండుగలు. వాటిని ప్రకృతి శక్తులను ఆరాధించడం పూర్వకాలం నుంచి వస్తోంది.

ఇంటిల్లిపాది ఆనందోత్సవాలతో సందడి చేసి ఆటాపాటల్లో నిమగ్నమవుతారు. జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి సంబరం, కనుమ సంబరాలు చూడముచ్చ టగా జరుగుతాయి. ఆరుగాలం శ్రమించిన రైతుల ఇంటి నిండా ధాన్య రాశులతో తులతూగే సమయంలో ఆన్నదాత ఆనందం పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులు బంధుగణం కలిసి ఉత్సహంతో జరుపుకునే పండగ, రైతన్న ఇంటా నిండైనా పండగ అనుబంధాల కలయిక సంక్రాంతి....

మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని ప్రజల నమ్మకం. బెల్లం, గుమ్మడికాయలు దానమిస్తారు. పితృదేవ తలకు తర్పణాలు వదులుతారు.

ఫ సంక్రాంతి...

27 నక్షత్రాలు, నక్షత్రానికి నాలుగు పాదాలు, మొత్తం 108 పాదాలు, ఆ పాదాలను 12 రాశులుగా విభజిస్తే సూ ర్యుడు నెలకో రాశిలోకి వెళుతాడు. జనవరి నెలలో సూర్యు డు మకర రాశిలో ప్రవేశించడం వలన మకర సంక్రాం తిగా పిలుస్తారు. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంటి ముంగిట కల్లాపి చల్లి ముగ్గులు వేయడం వలన లోగిలికి రంగుల అందం చేకూరుతోంది. సంక్రాంతి సంబరం మూడు రోజులపాటు జరుగుతుంది. ఉపాధి కోసం వెళ్ళిన కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు కుటుంబాలతో స్వగ్రా మాలకు చేరుతారు.

సంక్రాంతి సమయంలోనే హరిదాసులు కనిపిస్తారు. హరిదాసు కీర్తనలు ఆధ్యాత్మిక సమాజ శ్రేయ స్సు సాగడం, మనిషిలోని దానగుణాన్ని పెం పొందించేందుకు దోహదం చేస్తాయి. గంగిరె ద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో పండగ కళ తెచ్చి పెడుతోంది. పల్లెల్లో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల నగర సంకీర్త నల సందడి గొబ్బిళ్ళతో అలంకరణలతో పల్లె, పట్టణ వాకిళ్ళు చూడముచ్చటగా కనిపిస్తాయి. హరి దాసులు చేతిలో చిరుతలు, తంబుర వాయిద్యం తలమీద అక్షయ పాత్రను పెట్టుకుని నగర సంకీర్తనకు వస్తారు.

మూడురోజుల సంక్రాంతి పండగలో చివరిది కనుమ. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే జీవనాధారం. వ్యవ సాయంలో కీలకంగా వ్యవహారించే ఎద్దులు, ఆవులు, మేకలు ఆ రైతు కుటుంబంలో భాగంగా నిలుస్తాయి. వ్యవసాయ రంగంలో కష్ట, సుఖాల్లో తోడూ నీడగా నిలిచిన పశువులను ప్రత్యేకంగా పూజిస్తారు. పండగ రోజున పశు సంపదకు స్నానం చేయించి కుంకుమ, పసుపు, రాసి, బొట్టు పెట్టి మెడలో పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పాడి పంటల అభివృద్ధికి అనుగ్రహించాలని దేవతామూర్తులను ప్రార్థిస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడ బిడ్డలు, ఆల్లుళ్ళు, కుటుంబ సభ్యులతో ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు.

Updated Date - Jan 14 , 2024 | 10:08 PM