Share News

సమ్మక్క సారలమ్మ మొక్కులు

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:22 PM

ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మజాతర సందర్భంగా పలువురు భక్తులు నివాసాల వద్ద వన దేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం బెల్లాన్ని తులాభారం వేసేందుకు దుకాణాల ముందు బారులు తీరారు.

సమ్మక్క సారలమ్మ మొక్కులు

మందమర్రిటౌన్‌, ఫిబ్రవరి 11 : ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మజాతర సందర్భంగా పలువురు భక్తులు నివాసాల వద్ద వన దేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం బెల్లాన్ని తులాభారం వేసేందుకు దుకాణాల ముందు బారులు తీరారు. ఆయా కాలనీల నుంచి ప్రజలు ఆటోల్లో మార్కెట్‌ సెంటర్‌లోని దుకాణాల వద్దకు వచ్చి బెల్లం తులాభారం చేయించుకున్నారు. కోళ్లు, మేకలను బలి ఇస్తుండ డంతో గిరాకీ పెరిగింది. బెల్లాన్ని కొనుగోలు చేసిన భక్తులు ఆటోలను ఎంగేజ్‌ చేసుకుని నివాసాలకు తరలివెళ్లారు. బెల్లం తులాభారం చేసే దుకాణాల ముందు ఆటోలు బారులు తీరి కనిపించాయి. ఆటోల్లో బెల్లం బుట్టలను పెట్టుకున్న భక్తులు ఇండ్లకు బయలుదేరి వెళ్లారు.

బెల్లంపల్లి: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బెల్లంపల్లి పట్టణం లో భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం దుకాణాల వద్ద భక్తులు బెల్లం తులాభారం చేయించుకున్నారు. ఇండ్లకు వెళ్లి ప్రసాదంగా పంచి పెట్టారు. ఈ సందర్భంగా దుకాణాల్లో బెల్లం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

మందమర్రిరూరల్‌: సమ్మక్క సారలమ్మ మొక్కులో భాగంగా ప్రజలు ఇండ్లలో వన దేవతలకు పూజలు నిర్వహించారు అనంతరం మేక లు, కోళ్లను బలిచ్చి బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 11 , 2024 | 10:22 PM