Share News

రైసుమిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేలి

ABN , Publish Date - May 27 , 2024 | 10:26 PM

రైసుమిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేసుకోవాలని కాంగ్రెస్‌ నాయకు లు డిమాండ్‌ చేశారు. సోమవారం పట ణంలోని ఓ ఫంక్షన్‌ హాలులో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణా ధ్యక్షుడు ఎండీ ఆరీఫ్‌, ఆర్జీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తిలు మాట్లాడారు.

రైసుమిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేలి

లక్షెట్టిపేటరూరల్‌, మే 27: రైసుమిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేసుకోవాలని కాంగ్రెస్‌ నాయకు లు డిమాండ్‌ చేశారు. సోమవారం పట ణంలోని ఓ ఫంక్షన్‌ హాలులో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణా ధ్యక్షుడు ఎండీ ఆరీఫ్‌, ఆర్జీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తిలు మాట్లాడారు. ప్రేంసాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తూకం లో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించా రన్నారు. తరుగు పేరిట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్విం టాల్‌కు 5 నుంచి 10 కిలోల కోత విధించిందని, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు గోనె సంచి బరువు మాత్ర మే కటింగ్‌ ఉండేలా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బు లు జమ చేయించారన్నారు. ఇది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మె ల్యే దివాకర్‌రావు, జిల్లా రైసుమిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నలుమాసు కాంతయ్య రైసుమిల్లర్లు ధాన్యం తీసుకో కుండా వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ధాన్యం అన్‌లోడ్‌ చేయని రైసుమిల్లర్లపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుం దన్నారు. కార్యక్రమంలో అశోక్‌కుమార్‌, రమేష్‌, వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాస్‌, ముత్యాల శ్రీనివాస్‌, మోహన్‌, దేవేందర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 10:26 PM