Share News

ఆందోళనల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:16 PM

మండలంలోని దేవాపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనలు, నిరసనల మధ్య ముగిసింది. ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ నాలుగో ప్లాంటు విస్తరణలో భాగంగా ముడి సరుకు కోసం 588.26 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజు కోసం టీఎస్‌ఎండీసీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అధ్యక్షత వహించగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి లక్ష్మీప్రసాద్‌ హాజరయ్యారు.

ఆందోళనల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ

కాసిపేట, ఫిబ్రవరి 15: మండలంలోని దేవాపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనలు, నిరసనల మధ్య ముగిసింది. ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ నాలుగో ప్లాంటు విస్తరణలో భాగంగా ముడి సరుకు కోసం 588.26 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజు కోసం టీఎస్‌ఎండీసీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అధ్యక్షత వహించగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి లక్ష్మీప్రసాద్‌ హాజరయ్యారు. ఓరియంట్‌ కంపెనీ నాలుగు దశా బ్దాల్లో నాలుగు ప్లాంట్లకు విస్తరించిందని, స్ధానికు లకు ఉద్యోగాలు కల్పించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కంపెనీ ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైన్స్‌ లీజు కోసం అందరు అంగీకారం తెలుపు తూనే స్ధానిక యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే గేటు సమీపంలోని కొన్ని గూడాల్లో కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. విద్య, వైద్యం, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టా లన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులను ఓరియంట్‌ ప్రభావిత గ్రామాల్లో ఖర్చు చేసి దుమ్ముధూళి వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికేతర పిల్లలకు డీఏవీ పాఠ శాలలో ఉచితంగా విద్యనందించాలని, అలాగే జూని యర్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. 24 గంటలు ఓరియంట్‌ డిస్పెన్సరీలో వైద్య సేవలందిం చాలని, ఓరియంట్‌ ప్రభావిత గ్రామాల్లో అంబు లెన్స్‌ల సౌకర్యం కల్పించాలని కోరారు. మందమర్రి నుంచి ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీకు వచ్చే రైల్వే ట్రాక్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగా లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మూడెకరాల సాగు భూమి కోల్పోయి దినసరి కూలీగా పనిచేస్తు న్నానని చింతగూడెం చెందిన మడావి గోపాల్‌ ఆవే దన వ్యక్తం చేశాడు. భూములు ఇచ్చి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైల్వేలైన్‌లో భూములు కోల్పోయిన వారందరికి కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు ధిక్కరించారన్నారు. భూనిర్వా సితులకు, స్ధానికులకు కంపెనీలో ఉద్యోగాలు కల్పిం చాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల కోసం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరా రు. అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో విన్నవించిన సమస్యలను రాత పూర్వకంగా తెలియజేయా లని సూచించారు. ఓరియంట్‌ కంపెనీ యాజ మాన్యంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఫ మైన్స్‌ను ముట్టడించిన ప్రజలు

2018లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను ఓరియంట్‌ కంపెనీ నెరవేర్చక పోవడాన్ని నిరసిస్తూ గట్రావుపల్లి గ్రామ పంచాయ తీ ప్రజలు మైన్స్‌ ఏరియాను ముట్టడించారు. గ్రా మస్తులు మాట్లాడుతూ ఓరియంట్‌ మైన్స్‌లో పేలే బత్తి దెబ్బలకు ఇండ్లు బీటలు వారడంతోపాటు కా లుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఈ విషయాలపై అధికారులకు విన్నవించినా పట్టించు కోవడం లేదన్నారు. తుడుంగూడెం, ఇప్పలగూడెం, రేగులగూడెం, గట్రావుపల్లి, సాలెగూడెం, గోం డుగూడకు చెందిన సుమారు 200 మంది ప్రజలు మైన్స్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి చేరు కున్న ఏసీపీ రవికుమార్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఓరియంట్‌ కంపెనీ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఏసీపీ రవికుమార్‌ ఆధ్వర్యంలో ఓరియంట్‌ కంపెనీ యాజమాన్యం, ఆదివాసీ సంఘాల మధ్య చర్చలు కొనసాగుతు న్నాయి. ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్‌ భోజన్న, ఓరియంట్‌ కంపెనీ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 10:16 PM