Share News

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:38 PM

ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతీ దర ఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌, బెల్లంపల్లి, మంచిర్యాల ఆర్డీవోలు హరికృష్ణ, రాములుతో కలిసి ఆర్జీ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 4: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతీ దర ఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌, బెల్లంపల్లి, మంచిర్యాల ఆర్డీవోలు హరికృష్ణ, రాములుతో కలిసి ఆర్జీ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో 91 దరఖాస్తులు వచ్చాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపి పరిష్కారం దిశగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకొంటామన్నారు.

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణలో 57 దరఖాస్తులు వచ్చాయి. గతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇవ్వలేకపోయిన వారు ప్రస్తుతం ఇవ్వవచ్చని చైర్మన్‌ సుర్మిళ్ళ వేణు, కమిషనర్‌ చిట్యాల సతీష్‌లు తెలిపారు. దరఖాస్తులు ఇచ్చి రశీదు పొందవచ్చని సూచించారు.

మందమర్రిరూరల్‌: ఆదిల్‌పేట నుంచి రసూల్‌పల్లి వరకు రోడ్డు వెడల్పు చేయాలని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన వంజరి వెంకటేష్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌కు వినతిపత్రం అందించారు. రోడ్డంతా కంకర తేలి గుంతలు పడి ఉం దని, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. కొత్త రోడ్డును వేయడంతో పాటు రోడ్డును వెడల్పు చేయాలని విన్నవించారు.

తాండూర్‌: తాండూర్‌ గ్రామపంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నట్లు మాజీ వార్డు సభ్యుడు కేశెట్టి తిరుపతి తెలిపారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

భీమారం: మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో రాథోడ్‌ రాధ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో సమస్యలపై దరఖాస్తులు అందజేస్తే వాటిని పరిశీ లించి పరిష్కరిస్తామన్నారు. అధికారులు రాకేశ్‌ శర్మ, త్రయంబకేశ్వర్‌, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:38 PM