రిటైర్డ్ ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Jul 15 , 2024 | 10:30 PM
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ అందించారు. పెన్షన్‌దారులకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు.
నస్పూర్, జూలై 15 : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ అందించారు. పెన్షన్‌దారులకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈఎస్‌ఎస్ స్కీం ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షన్ దారులకు నగదు రహిత చికిత్సలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కలెక్టర్‌ను కోరినట్లు నాయకులు తెలిపారు. పెన్షన్‌దారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు శంకరయ్య, రవి కుమార్, ఆగచారి, కెఎంఎస్ రెడ్డి, ఎక్బాల్, మాధవ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, నర్సింగరావు, రాజన్న పాల్గొన్నారు.