Share News

గర్భిణులు పౌష్ఠికాహారం తీసుకోవాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:43 PM

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి అర్పి తరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలో నిర్వ హించిన లీగర్‌ అవెర్‌నెస్‌ క్యాంపులో మాట్లాడారు.

గర్భిణులు పౌష్ఠికాహారం తీసుకోవాలి

ఏసీసీ, ఏప్రిల్‌ 6 : గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి అర్పి తరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలో నిర్వ హించిన లీగర్‌ అవెర్‌నెస్‌ క్యాంపులో మాట్లాడారు. గర్భిణీలు గర్భం దాల్చిన ప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు డాక్టర్‌ల సూ చనలు, సలహాలు పాటి స్తూ సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్ప కుండా వైద్య పరీక్షలు చే యించుకోవాలన్నారు. అ నంతరం గర్బిణీలు, బాలింతలకు పండ్లు పంపి ణీ చేశారు. ఆసుపత్రిలోని బాలింతలు, పిల్లల వార్డులను సందర్శించి సేవలను పరిశీలించారు. ఆర్‌ఎంవో భీష్మ, ప్రొఫెసర్‌ వేదవ్యాస్‌, గైనకాలజిస్టులు కీర్తిశ్రీ, డాక్టర్‌ ప్రశాంతి, లీగల్‌ హెడ్‌ కౌన్సిల్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 10:43 PM