Share News

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:13 PM

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో లోక్‌సభ ఎన్ని కలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొ న్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్డీవో రాములు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌లతో కలిసి రాజకీయ ప్రతిని ఽధులతో సమావేశం నిర్వహించారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 25: పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో లోక్‌సభ ఎన్ని కలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొ న్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్డీవో రాములు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌లతో కలిసి రాజకీయ ప్రతిని ఽధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియో జకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యాలు లేకుండా తాగునీరు, విద్యు త్‌, నీడ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమస్యాత్మ కేంద్రాల వద్ద రక్షణ దళాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం కం ట్రోల్‌ రూం, టోల్‌ప్రీ నెంబర్లును ఏర్పాటు చేశామ న్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉం టుందన్నారు. అభ్యర్ధులు ప్రచారం, సభలు, సమావే శాలకు అనుమతులు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్య లు ఉంటాయన్నారు.

ఫ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో దివ్యాంగులు, వయోవృ ద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు ఏర్పాటు చేసిన ఓటరు అవ గాహన సదస్సులో డీఆర్‌డీవో కిషన్‌, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాటా ్లడుతూ సమర్దవంతమైన నాయకున్ని ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నారు. దివ్యాంగులు, గర్భిణీలు, వయో వృద్ధులకు పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపు, ప్రత్యేక వరు స ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం అం దరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కళాజాత బృం దం ప్రదర్శినలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 11:13 PM