Share News

ఎకరానికి రూ. 25 వేలు చెల్లించాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:28 PM

సాగునీరందక ఎండిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరా నికి రూ.25 వేలు ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీని వాస్‌, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్‌లు అన్నారు. శుక్రవారం ఐబీ చౌర స్తాలో చేపట్టిన రైతు సత్యాగ్రహ దీక్షలో మాట్లాడారు.

ఎకరానికి రూ. 25 వేలు చెల్లించాలి

ఏసీసీ, ఏప్రిల్‌ 5: సాగునీరందక ఎండిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరా నికి రూ.25 వేలు ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీని వాస్‌, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్‌లు అన్నారు. శుక్రవారం ఐబీ చౌర స్తాలో చేపట్టిన రైతు సత్యాగ్రహ దీక్షలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ, రూ.15 వేల రైతు భరో సా, నీరందక ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కు తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తేమ, తప్ప, తాలు పేరుతో తరుగుతీసి రైతులను దోచుకుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగు నీరందక ఎండిన పంటలకు పరిహారం చెల్లించకుండా మోసం చేస్తోందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కుటుంబ పాలన సాగిస్తున్న వివేక్‌ కుటుంబాన్ని తరిమికొట్టాలన్నారు. గతంలో బీజేపీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల పంటలు మునిగిపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. వివేక్‌కు కొడుకును ఎంపీ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని పునరుద్దరించారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. నాయకులు జైన్‌, దుర్గం అశోక్‌, మల్లారెడ్డి, కొయ్యల ఏమాజీ, వెంకటేశ్వర్‌గౌడ్‌, సిసోడియా పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 10:28 PM