Share News

గల్లీకో ఎమ్మెల్యేతో ప్రజల ఇబ్బందులు

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:20 PM

బెల్లంపల్లి నియోజకవర్గంలో గల్లీకో ఎమ్మెల్యేతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడ్డం వినోద్‌ ఎమ్మెల్యేగా గెలిచాక స్ధానికంగా ఉం డకుండా హైద్రాబాద్‌కే పరిమితమయ్యాడని, దీంతో గల్లీకో ఎమ్మెల్యే పుట్టు కొస్తున్నాడని ఆరోపించారు.

గల్లీకో ఎమ్మెల్యేతో ప్రజల ఇబ్బందులు

బెల్లంపల్లి, జూలై 8: బెల్లంపల్లి నియోజకవర్గంలో గల్లీకో ఎమ్మెల్యేతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడ్డం వినోద్‌ ఎమ్మెల్యేగా గెలిచాక స్ధానికంగా ఉం డకుండా హైద్రాబాద్‌కే పరిమితమయ్యాడని, దీంతో గల్లీకో ఎమ్మెల్యే పుట్టు కొస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచాక స్ధానికంగా ఉంటానని ప్రమాణం చేసి మాట తప్పాడన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట నిలబెట్టు కోలేదన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలను సన్మానించారు. స్ధానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమన్నారు. నాయకులు సత్యనారాయణ, బానయ్య, బడికెల శ్రావణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:20 PM