Share News

మాతా శిశు ఆసుపత్రిలో విద్యుత్‌ సమస్య లేదు

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:52 PM

జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి (ఎంసీఎహెచ్‌)లో విద్యుత్‌ సమస్య తలెత్తిందని, దీంతో ఆసుపత్రిలోని బాలింత లు, గర్భిణులు, శిశువులు ఇబ్బందులు పడుతున్నా రని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరిం టెండెంట్‌ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.

మాతా శిశు ఆసుపత్రిలో విద్యుత్‌ సమస్య లేదు

మంచిర్యాల అర్బన్‌, జూలై 5: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి (ఎంసీఎహెచ్‌)లో విద్యుత్‌ సమస్య తలెత్తిందని, దీంతో ఆసుపత్రిలోని బాలింత లు, గర్భిణులు, శిశువులు ఇబ్బందులు పడుతున్నా రని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరిం టెండెంట్‌ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఎంసీహెచ్‌లో 3వ తేదీన విద్యుత్‌ సరఫరాలో సమస్య తలెత్తిన విషయం వాస్తవమే నని, విద్యుత్‌ శాఖ అధికారుల సమన్వయంతో సమ స్యను పరిష్కరించామని చెప్పారు. ఆసుపత్రిలో రోజంతా కరెంట్‌ లేదని, అందరూ ఇబ్బందులు పడు తున్నారని, ఆపరేషన్లు కూడా టార్చ్‌ లైట్ల వెలుగులో చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన వార్త ల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

జనరేటర్‌ సహా యంతో విద్యుత్‌ అందించామని, కేవలం 3 గంటల పాటు మాత్రమే సరఫరాలో అంతరాయం కల్గిం దన్నారు. ఎంసీహెచ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ భీష్మ, ఆర్‌ఎం వో డాక్టర్‌ శ్రీమన్నారాయణ, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్‌

జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుప త్రిని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. ఆర్‌ఎంవో భీష్మతో కలిసి ఆసుపత్రిలోని వార్డు లు, ల్యాబ్‌, ఫార్మసీ, పరిసరాలను పరిశీలిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణులు, పిల్లలకు మెరుగైన సేవలందించేందుకు ఆధునిక పరికరాలు, సౌకర్యాలు కల్పించామ న్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకా రం భోజనం, పాలు అందించాలన్నారు. సిబ్బందిలో గైర్హాజరైన వారి వివరాలను అందించాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, జన రేటర్‌ పనిచేసేలా, ఆర్‌ఓ ప్లాంట్‌ నిర్వహణను పర్య వేక్షించాలని సూచించారు. అనంతరం ఆటో యూని యన్‌ వారితో కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. వైద్యులు అలివేణి, కీర్తి పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 10:52 PM