అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Jan 29 , 2024 | 10:08 PM
ప్రజలు పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ పెండింగ్ కేసుల ను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 29: ప్రజలు పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ పెండింగ్ కేసుల ను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. 2012 నుంచి 2022 వరకు వివిధ కేసుల్లో 447 మంది బాధితులకు రూ. 4,75,44,750 పరిహారం మంజూరు అందించామని తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో సివిల్ రైట్స్‌డే సందర్భంగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీసీపీసుధీర్‌రాంనాధ్‌కేకన్ మాట్లా డుతూ ఎఫ్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఎస్‌హెచ్‌వోలు, సీఐలు, ఎస్‌ఐలతో విచారణ ప్రక్రి య వేగవంతం చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ రాహుల్, ఆర్డీవో రాములు, ఏసీపీలు తిరుపతి, మోహన్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి ఉప సంచా లకులు పోటు రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, వయోజన విద్యాధికారి పురుషోత్తం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పర్యావరాణాన్ని రక్షించాలి
అడవులు, సరస్సులు, నదులు, వన్య ప్రాణులతో సహజ పర్యావరణాన్ని రక్షించడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ సుదీర్‌రాంనాధ్‌కేకన్, జిల్లా పశు వైద్య సం యుక్త సంచాలకులు రమేష్, సహాయ సంచాకులు శంకర్‌తో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అడవులు, సరస్సులు, వన్యప్రాణు లను రక్షించాలన్నారు. పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాహుల్, ఆర్డీవో రాములుతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి ప్రజలు దర ఖాస్తులను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్య లు తీసుకొంటామన్నారు. అధికారులు పాల్గొన్నారు.