Share News

చెరువు వద్ద ముదిరాజ్‌ల ఆందోళన

ABN , Publish Date - May 24 , 2024 | 10:17 PM

చెన్నూరు పెద్ద చెరువులో గంగపుత్రులు చేపలు పట్టుకునేందుకు మత్య్సశాఖ అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ముది రాజ్‌ కులస్తులు శుక్రవారం చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. ముదిరాజ్‌ కులస్తులు వాటా సమస్య పరిష్కరించకుండా, సొసైటీలో ఉన్న బోగస్‌ పేర్లు తొలగించకుండా ఎలా అనుమతించారని మత్య్సశాఖ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ధన్‌ను ప్రశ్నించారు.

చెరువు వద్ద ముదిరాజ్‌ల ఆందోళన

చెన్నూరు, మే 24: చెన్నూరు పెద్ద చెరువులో గంగపుత్రులు చేపలు పట్టుకునేందుకు మత్య్సశాఖ అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ముది రాజ్‌ కులస్తులు శుక్రవారం చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. ముదిరాజ్‌ కులస్తులు వాటా సమస్య పరిష్కరించకుండా, సొసైటీలో ఉన్న బోగస్‌ పేర్లు తొలగించకుండా ఎలా అనుమతించారని మత్య్సశాఖ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ధన్‌ను ప్రశ్నించారు. సీఐ రవీందర్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఇరుపక్షాలతో మాట్లాడారు. సొసైటీలో సభ్యుల వివరాల గురించి సీఐ తెలుసుకున్నారు. సొసైటీలో నలుగురు ముదిరాజ్‌లకు సభ్యత్వం ఉందని వారు చేపలు పట్టుకోవచ్చని తెలిపారు. గతంలో ముదిరాజ్‌లు, గంగపుత్రు ల మధ్య చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం చెరువులో సగం వాటా కావాలని ముదిరాజ్‌ కులస్తులు తేల్చి చెప్పారు. అధికారులు శని వారం సొసైటీ సభ్యుల పేర్లతోపాటు గుర్తింపు కార్డులు తీసుకువస్తామని తెలిపారు. చెరువు వివాదం శనివారంకు వాయిదా పడింది. దీంతో ఇరు వర్గాలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి.

Updated Date - May 24 , 2024 | 10:17 PM