Share News

ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:16 PM

త్వరలో జరిగే ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 7: త్వరలో జరిగే ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎంఆర్‌పీఎస్‌ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మందకృష్ణ మాదిగ సొంత జిల్లా వరంగల్‌లో నిర్వహిస్తామన్నారు. మాదిగ జాతి భవిష్యత్‌కు 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. దేశం మొత్తం మాదిగల వైపు చూసేలా వరంగల్‌లో ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తామన్నారు. వేడుకలకు మాదిగలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాయకులు శ్రీనివాస్‌, శంకర్‌వర్మ, సతీష్‌ మాదిగ, శంకర్‌, శేఖర్‌, రాజలింగు, రాజశేఖర్‌, ఐలక్క, సుగుణాకర్‌, విష్ణు, ప్రశాంత్‌, ప్రాన్సిస్‌, శేఖర్‌ మాదిగలు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 10:16 PM