వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:19 PM
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని శుక్రవారం టేకులబస్తీ 15వ వార్డుకు చెందిన యువ కులు బెల్లంపల్లి ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందిం చారు.

బెల్లంపల్లి, జూన్ 7: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని శుక్రవారం టేకులబస్తీ 15వ వార్డుకు చెందిన యువ కులు బెల్లంపల్లి ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందిం చారు. వార్డులోని మురికి కాలువలు నిండిపోయి ఉన్నాయని, వర్షాలు కురి స్తే కాలువల్లో నుంచి నీరు ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మురికి కాలువలను శుభ్రం చేయాలని, దోమల నివారణకు చర్యలు చేప ట్టాలని, మిషన్ భగీరథ నీరు అందరికి అందేలా పైపులైన్ వేయాలని కోరారు. లోకేశ్వర్, బొల్లి వంశీ, రావణ్, శ్యామ్, నగేష్, రాజు పాల్గొన్నారు.