Share News

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:44 PM

వేసవి కాలం దృష్ట్యా గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకో వాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ అన్నారు. సోమవా రం పారుపెల్లి, ఏదులబంధం గ్రామాల్లో పర్యటించిన ఆయన మిషన్‌ భగీరథ పైపులైన్‌, పారిశుధ్య పనుల ను పరిశీలించారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

కోటపల్లి, ఏప్రిల్‌ 8 : వేసవి కాలం దృష్ట్యా గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకో వాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ అన్నారు. సోమవా రం పారుపెల్లి, ఏదులబంధం గ్రామాల్లో పర్యటించిన ఆయన మిషన్‌ భగీరథ పైపులైన్‌, పారిశుధ్య పనుల ను పరిశీలించారు. పైపులైన్‌లలో లీకేజీలు తలెత్త కుండా ఎప్పటికప్పుడు పనులను పూర్తి చేయాల న్నారు. అత్యవసర పరిస్థితుల్లో నీటి ఎద్దడి తలెత్తితే వ్యవసాయ బోర్ల నుంచి గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. ,ప్రత్యేకాధికారులు రోజు గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షణ జరపాల న్నారు. ఎంపీడీవో ఆకుల భూమన్న, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ బద్రినాధ్‌ స్వామి,మిషన్‌ భగీరథ ఏఈ వివేక్‌, తదితరులు ఉన్నారు.

భీమిని: తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎంపీడీవో గంగమోహన్‌ అన్నారు. భీమిని, కన్నెపల్లి మండలాల కార్యదర్శులతో సమావేశం నిర్వహిం చారు. మూడు మాసాలు అన్నీ గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధిహామీ పనులు ప్రతీ ఒక్క జాబ్‌కార్డు కూలీలకు కల్పించాలన్నారు. మం డల ప్రత్యేకాధికారి ఏడి మైన్స్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఏపీ ఓలు సఫ్దర్‌ అలీ, శ్రీనివాస్‌, ఆర్‌డబ్యూఎస్‌ ఏఈలు పోశం, శ్రీకాంత్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 10:44 PM