Share News

మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:47 PM

వెనుకబడిన వేమనపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. శుక్రవారం మండల పరిష త్‌ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

వేమనపల్లి, జనవరి 5: వెనుకబడిన వేమనపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. శుక్రవారం మండల పరిష త్‌ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ మండలంలో అనేక సమ స్యలు ఉన్నాయని, వాటిని దశల వారీగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం అన్ని వర్గాల సంక్షేమానికి గ్యారంటీ పథకాలను తీసుకువచ్చిందని, వీటిని సమ ర్ధవంతంగా అమలు చేస్తామన్నారు. ఎమ్మె ల్యేను ఎంపీడీవో, ఎంపీటీసీలు, కార్యాలయం సిబ్బంది సన్మానించారు. ఎంపీపీ కోలి స్వర్ణ లత, జెడ్పీటీసీ రుద్రభట్ల స్వర్ణలత, ఎంపీ టీసీలు సంతోష్‌కుమార్‌, ఆదె చంద్రకళ, తహసీల్దార్‌ సదానందం, ఎంపీడీవో లక్ష్మ య్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుబిడె వెంకటేశం, సర్పంచులు గాలి మధు, కొండగొర్ల బాపు, పల్లె రమేష్‌గౌడ్‌ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దస్నాపూర్‌, నీల్వాయి గ్రామాల్లో పర్యటించారు. నీల్వాయిలో కార్యకర్తల ఆత్మీ య సమ్మేళనంలో పాల్గొని పలు సూచనలు చేశారు. నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కుటుంబీకులను సన్మానించారు. సాబీర్‌ ఆలీ, నర్సింగరావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు సన్మానం

బెల్లంపల్లి: ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను బెల్లంపల్లి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కమిటీ సభ్యులు షిర్డీలో జరిగిన పల్లకి సేవలో పాల్గొని తీసు కువచ్చిన తీర్ధ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అం దించారు. ఆలయ చైర్మన్‌ ఆవునూరి దుర్గ య్య, సభ్యులు దత్తు, చరణ్‌ పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో పూజలు

చెన్నూరు: పట్టణంలోని మధున పోచ మ్మ ఆలయంలో ఎమ్మెల్యే వినోద్‌ వెంకట స్వామి కుటుంబీకులతో కలిసి పూజలు నిర్వ హించారు. అధికారులు స్వాగతం పలికారు.

Updated Date - Jan 05 , 2024 | 10:47 PM