Share News

అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శనం

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:01 PM

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శన మని టీఎన్‌జీవో నాయకులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ ఏసీ గదుల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నారని హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండి స్తున్నామన్నారు.

అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శనం

ఏసీసీ, మార్చి 9: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శన మని టీఎన్‌జీవో నాయకులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ ఏసీ గదుల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నారని హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండి స్తున్నామన్నారు. గత ప్రభుత్వ అసమర్ధత వల్ల వేతనాలు, పెండింగ్‌ బిల్లుల కోసం ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఈ వ్యాఖ్యలు గత పాలకుల అహంకారణ ధోరణిని బహిర్గతపరిచాయన్నారు. జీవో నెంబరు 317 ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను గత పాలకులు చిన్నా భిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఓర్వ లేకనే ఉద్యోగులకు, రైతులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా బీఆర్‌ఎస్‌ నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య, నాయకులు బాబురావు, సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 10:01 PM