అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయిస్ బ్రెయిలీ
ABN , Publish Date - Jan 10 , 2024 | 10:34 PM
అంధుల కోసం లిపిని సృష్టించి వారి జీవితంలో వెలుగులు నింపిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ అని కలె క్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల ను నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 10: అంధుల కోసం లిపిని సృష్టించి వారి జీవితంలో వెలుగులు నింపిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ అని కలె క్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల ను నిర్వహించారు. సంక్షేమాధికారి చిన్నయ్య, డీఆర్ డీవో శేషాద్రితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంధులు సామాన్యులతో సమానంగా అన్ని రం గాల్లో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ ఆరు చుక్కలతో కూడిన లిపిని తయారు చేశార న్నారు. అనంతరం క్యాలెండర్‌ను ఆవిష్కరించి కేక్ కట్ చేసి అంధులను సన్మానించారు.
మెరుగైన వైద్య సేవందించాలి
జిల్లాలోని కాలేజీ రోడ్డులో కొనసాగుతున్న మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. బుధవారం కాలేజీ రోడ్డులోని మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, సివిల్ సర్జన్ రెసిడెంట్ వైద్యాధి కారి భీష్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బా రాయుడుతో కలిసి సందర్శించారు. కర్ణన్ మాట్లాడు తూ మాతా శిశు ఆసుపత్రి ద్వారా విశిష్ట సేవలు అందిస్తుందని తెలిపారు. వైద్య సేవలు మరింత విస్తృతం చేసేందుకు రూ.205 కోట్లతో మాతా శిశు ఆసుపత్రి నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.