Share News

దేశ భక్తి పేరుతో సంపద లూటీ

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:18 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ భక్తి పేరుతో సంపదను లూటీ చేస్తోందని ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్య దర్శి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన ఐఎఫ్‌టీయూ సమావేశంలో మట్లాడారు.

దేశ భక్తి పేరుతో సంపద లూటీ

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 8: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ భక్తి పేరుతో సంపదను లూటీ చేస్తోందని ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్య దర్శి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన ఐఎఫ్‌టీయూ సమావేశంలో మట్లాడారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తుందన్నారు. సింగరేణి సంస్థకు గనులను కేటాయించకుండా కేంద్రం కుట్రలు చేస్తోం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గనులను సింగరేణికి దక్కేలా పోరాడాలని పేర్కొ న్నారు. విప్లవ కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించే పోరాటంలో సిం గరేణి కార్మికవర్గం విజయవంతం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రమా దాలు జరిగినప్పుడు ఎల్లోకార్డు, రెడ్‌కార్డు పేరిట కార్మికులను భయభ్రాం తులకు గురి చేస్తుందని, ఈ సర్య్కూలర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నరేష్‌, శ్రీనివాస్‌, అశోక్‌, నాగేశ్వర్‌రావు, మల్లేష్‌, జాఫర్‌, శంకర్‌, బ్రహ్మానందం, సంతోష్‌, కొమురయ్య, వెంకన్న, మొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:18 PM