Share News

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దాం

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:34 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని ఆర్‌పీ గార్డెన్‌లో నిర్వహించిన నియోజకవర్గస్ధాయి కాంగ్రెస్‌ నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దాం

బెల్లంపల్లి, ఏప్రిల్‌ 12: పార్లమెంట్‌ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని ఆర్‌పీ గార్డెన్‌లో నిర్వహించిన నియోజకవర్గస్ధాయి కాంగ్రెస్‌ నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు లకు, ప్రజలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నిరుద్యోగులకు ఉద్యో గాలకు ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కల్పిం చలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమ లు చేశామన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని, అదే విధంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ కాం గ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలి పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. పార్ల మెంట్‌ ఎన్నికల తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పూర్తిస్ధాయిలో కృషి చేస్తారన్నారు. బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసు కువెళ్లామని సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రజలకు గోదావరి నీటిని అందిస్తామని, రహదారులు పూర్తిస్ధాయిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అబివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెం ట్‌ అభ్యర్థి గడ్డం వంశీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను గెలిపించిన తర్వాత బెల్లంపల్లిలో ఇంజనీ రింగ్‌ కళాశాలతోపాటు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను హాల్టిం గ్‌ అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు వివేక్‌, మక్కాన్‌సిం గ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్‌టీయూసీ నాయకులు వెంకట్రావు, జనక్‌ప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్వేత, నాయకులు నాతరి స్వామి, బండి ప్రభాకర్‌, మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:34 PM