Share News

kumarm bheem asifabad : డిజిటల్‌ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:03 PM

కెరమెరి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్‌ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

kumarm bheem asifabad : డిజిటల్‌ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

కెరమెరి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్‌ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని హట్టి ఆశ్రమపాఠశా లలో ఏర్పాటుచేసిన డిజిటల్‌ ల్యాబ్‌ను ఐటీడీఏ పీవో కుష్బుగుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు.. ఉపాధ్యాయులు తరగతులలో బోధించే పాఠ్యాంశాలతోపాటు డిజిటల్‌ ల్యాబ్‌ల ద్వారా అర్థం కాని విషయాలను నేర్చుకుని వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాల తరగతులు ముగిసిన తరువాత విద్యార్థులు ప్రతిరోజు ఒకగంటసేపు డిజిటల్‌ ల్యాబ్‌లో కూర్చుని అర్థం కాని పాఠాలను వినాలన్నారు. జిల్లాలోని హట్టి, ఆసిఫాబాద్‌ బాలికల ఆశ్రమపాఠశాలలో డిజిటల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు రమాదేవి, ఏసీఎంవో ఉద్దవ్‌, జీసీడీవో శకుంతల, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జంగుబాయి ఉత్సవాల పోస్టర్ల విడుదల..

కెరమెరి మండల సరిహద్దులోని ముక్దంగూడ అడ వుల్లో జరిగే జంగుబాయి ఉత్సవాల పోస్టర్లను శనివారం కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా ఆవిష్కరించారు. జనవరి2 నుంచి నెలరోజుల పాటు జరిగే జంగుబాయి ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఆరు గోత్రాల గిరిజనులు భారీగా తరలిరానున్నారు.

చేపల పెంపకంతో అధిక ఆదాయాన్ని పొందాలి..

వాంకిడి: చేపల పెంపకందారులు అధిక ఆదా యాన్ని పొందాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని సరండి గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన చేపల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఏడు గురు గిరిజనరైతులు సుమారు 15ఎకరాల్లో నిర్మించు కున్న చేపల చెరువును పరిశీలించారు. చేపల పెంపకంలో అధిక ఆదాయం దిశగా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. కార్యక్ర మంలో జిల్లా మత్స్యశాఖఅధికారి సాంబశివరావు, తహసీల్దార్‌ రియాజ్‌అలీ, ఎంపీ డీవో ప్రవీణ్‌ కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ వేతనాలు

చెల్లించాలి..

ఆసిఫాబాద్‌: పెండింగ్‌ వేత నాలు చెల్లించాలని శనివారం కలె క్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు సీఐటీయూ నాయకులతో కలిసి 104ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో 104 ఉద్యోగులు ప్రశాంత్‌, మల్లేష్‌, తిరుపతి, అనీల్‌కుమార్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:03 PM