Share News

Kumaram Bhim Asifabad: మహిళలు ‘భరోసా’ సేవలు వినియోగించుకోవాలి: ఎస్పీ

ABN , Publish Date - Aug 21 , 2024 | 10:28 PM

ఆసిఫాబాద్‌, ఆగస్టు 21: బాధిత బాలికలు, మహిళలు భరోసా సెంటర్‌ సేవలను వినియోగించుకోవా లని ఎస్పీడీవీ శ్రీని వాసరావు అన్నారు.

 Kumaram Bhim Asifabad:  మహిళలు ‘భరోసా’ సేవలు వినియోగించుకోవాలి: ఎస్పీ

- ఎస్పీ డీవీ శ్రీనివాస్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 21: బాధిత బాలికలు, మహిళలు భరోసా సెంటర్‌ సేవలను వినియోగించుకోవా లని ఎస్పీడీవీ శ్రీని వాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో డబ్ల్యూఎస్‌ఐ తిరు మల ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తిరుమల రామగుండం కమిషనరేట్‌ నుంచి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భరోసా సెంటర్‌లో పోలీసుసేవలు, కౌన్సెలింగ్‌, వైద్య, న్యాయసేవలు అందిస్తామ న్నారు. బాధితులకు జిల్లా లీగల్‌సర్వీస్‌ అథారిటీ సహకారంతో నష్టపరిహారం అంది స్తామన్నారు. ఇప్పటివరకు భరోసా సెంటర్‌ ద్వారా జిల్లాలో 9కేసుల్లో న్యాయ సహాయం అందించినట్లు తెలిపారు. ఎవరైనా బాలికలు, మహిళలు లైంగిక నేరానికి గురైనట్లయితే 871267056కు ఫోన్‌చేసి వివరాలు తెలియజేస్తే సిబ్బంది బాధితుల ఇంటి వద్దకు వెళ్లి సత్వరన్యాయం చేసేందుకు కృషిచేస్తారని అన్నారు. అనంతరం ఉమెన్‌సేఫ్టీ వింగ్‌ద్వారా భరోసా సెంటర్‌కు మంజూ రైన టీవీ, మొబైల్‌ఫోన్‌ను ఎస్పీ భరోసా సెంటర్‌ సిబ్బందికి అందజేశారు.

Updated Date - Aug 21 , 2024 | 10:28 PM