Share News

Kumaram Bhim Asifabad: తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:25 PM

ఆసిఫాబాద్‌, మార్చి 28: గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలతోపాటు సీసీరోడ్లు, ఇంటిపన్నుల వసూలు తదితర పనులను ప్రణాళికబద్దంగా పూర్తి చేయా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 Kumaram Bhim Asifabad:  తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మార్చి 28: గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలతోపాటు సీసీరోడ్లు, ఇంటిపన్నుల వసూలు తదితర పనులను ప్రణాళికబద్దంగా పూర్తి చేయా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, అదనపు పంచాయతీ అధికారి సురేందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్‌, ఉమర్‌ హుస్సేన్‌తో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయ తీల్లో వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చేతి పంపులు, పంపుసెట్లు, మిషన్‌ భగీరథ పైపులు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. లీకేజీ సమస్యలు పరిష్కరించాలన్నారు. నీటిఎద్దడి ఉన్నచోట ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో అన్నిగ్రామాల్లో ఈనెల31 వరకు వంద శాతం ఇంటిపన్నులు వసూలు చేయాలన్నారు. ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలికి వందరోజుల పని కల్పించాలన్నారు. కూలీల హాజరు శాతం పెంచాలన్నారు. అలాగే గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమా ధికారి భాస్కర్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంపీ డీవో, ఎంపీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, తదిత రులు పాల్గొన్నారు.

పోలింగ్‌ అధికారులకు అవగాహన కల్పించాలి

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణపై పోలింగ్‌ అధికారులకు పూర్తి అవగాహన కల్పిం చాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. పోలింగ్‌ రోజున అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చూడాలన్నారు. కలెక్టరేట్‌లో పోలింగ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చే మాస్టర్‌ ట్రైనర్లకు ఇచ్చిన శిక్షణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌లు దీపక్‌ తివారి, దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ విధులు నిర్వహించే పీవో, ఏపీవోలు ఇతర పోలింగ్‌ సిబ్బందికి ప్రతి అంశంపై మాస్టర్‌ ట్రైనర్లు అవగాహన కల్పించాల న్నారు. ఈవీఎం, వీవీప్యాట్లపై ప్రిసైడింగ్‌ అధికారి, అదనపు ప్రిసైడింగ్‌ అధికార్లకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. 7-సీడైరీలోని ప్రతిఅంశం తెలియ పర్చడంతోపాటు పోలింగ్‌ రోజు ఉపయోగించే ప్రతికవర్‌ను పూర్తి సమాచారంతో నింపే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. మాక్‌పోలింగ్‌ తప్పని సరిగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:25 PM