Share News

Kumaram Bheem Asifabad: పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

ABN , Publish Date - May 16 , 2024 | 10:49 PM

ఆసిఫాబాద్‌, మే 16: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోగా అమ్మఆదర్శ పాఠశాలలకమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

 Kumaram Bheem Asifabad:  పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 16: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోగా అమ్మఆదర్శ పాఠశాలలకమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) దీపక్‌ తివారి, డీఈవో అశోక్‌తో కలిసి విద్యాశాఖ అధికారులు, మండలనోడల్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ విభాగం అదికారు లతో పాఠశాలల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అమ్మఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 685ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోగా పూర్తిచేయాలన్నారు. ప్రతి పాఠశా లలో తాగునీరు, మూత్రశాలలు, సౌచాలయాలు, విద్యుత్‌ సంబం ధిత పనులు, నియంత్రిక బోర్డులు, ఫ్యాన్లు తదితర పనులను పూర్తిచేయాలని తెలిపారు. బోర్‌వెల్స్‌ మరమ్మతులు, ట్యాంకుల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బాలికల కొరకు ప్రత్యేక మూత్రశాలల నిర్మించాలని తెలిపారు. చిన్న,పెద్ద మరమ్మతు పనులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాల న్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 10:49 PM