Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా మహిళా దినోత్సవం

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:05 PM

ఆసిఫాబాద్‌, మార్చి 8: ఆసిఫాబాద్‌ బార్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహి ళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీనియర్‌ సివిల్‌జడ్జి యువరాజ్‌, జూనియర్‌ సివిల్‌జడ్జి అనంతలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు.

 Kumaram Bheem Asifabad:   ఘనంగా మహిళా దినోత్సవం

ఆసిఫాబాద్‌, మార్చి 8: ఆసిఫాబాద్‌ బార్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహి ళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీనియర్‌ సివిల్‌జడ్జి యువరాజ్‌, జూనియర్‌ సివిల్‌జడ్జి అనంతలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌బాబు, న్యాయవాది రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు గాయత్రి, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లాకేంద్రంలో మున్సిపాలిటీలో మహిళా కార్మికులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమం లో మున్సిపల్‌సిబ్బంది సంతోష్‌, నాగేందర్‌, బాబు, శంకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళా పోలీసు సిబ్బందికి సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని ప్రపంచానికి వెలుగు చూపేది మహిళలేన న్నారు. పురుషులతో పోటీప డుతూ ఉద్యోగ అవకాశాల్లో విధుల్లో వారితో సమానంగా మహిళలు పనిచేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళ అధికారులకు, సిబ్బందికి బెస్ట్‌ ఉమెన్‌ ఎంప్లాయ్‌ అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, సీఐ సతీష్‌, ఆర్‌ఐ పెద్దన్న, ఎస్సైలు సోనియా, తేజస్విణి, మహిళ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరు: మండలంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ నాయ కుడు శ్రీవర్ధన్‌, టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యా యులు, అంగన్‌ వాడీటీచర్లు, మహిళాఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో శంకర్‌, ఉపాధ్యా యులు శ్రీనివాస్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): మండల కేంద్రంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మాన్ని ఆదిలాబాద్‌ ఎస్‌బిఐ అధికారి ఆత్రం సునీల్‌కుమా ర్‌ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేసి మహిళలకు మిఠాయిలు తినిపించారు. మహిళాలకు పలువురు మహిళాదినోత్సవ శుభా కాంక్షలు తెలియజేశారు. మహిళాలు సమాజంలో సమానహక్కులు పొందాల్సిన అవసరం ఉంద న్నారు. కార్యక్రమంలో మాజీమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, గ్రామపటేల్‌ ఆత్రం ఆనంద్‌రావు, కనక శ్యాంరావు, కనక నాగోరావు, గోడం అమృత్‌రావు, ఆత్రం గంగారాం, మాజీసర్పంచ్‌ ఆత్రం ఓంప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని శుక్రవారం మండలకేంద్రంలో ఘనంగా జరుపుకొన్నా రు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌నాయకులు, శివాలయంలో తుంబ్డె మహరాజ్‌ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. కార్యక్రమం లో మాజీసర్పంచు బండె తుకారాం, ఖమాన ఎంపీ టీసీ ప్రవీణ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుర్నులే నారా యణ, యూత్‌ అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్‌, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 10:05 PM