Kumaram Bheem Asifabad: సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: ఎంపీ నగేష్
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:15 PM
కాగజ్‌నగర్, జూలై 5: జిల్లాలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడిఆదిలాబాద్ జిల్లా ఎంపీ గోడం నగేష్ అన్నారు.

-ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్
కాగజ్‌నగర్, జూలై 5: జిల్లాలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడిఆదిలాబాద్ జిల్లా ఎంపీ గోడం నగేష్ అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో తనను గెల్పించిన జిల్లా వాసులందరికీ ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు. కాగజ్‌నగర్‌లోని ఎల్లాగౌడ్ తోటలో 100పడకల ఏరియా ఆసుపత్రి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో పోడురైతుల సమస్య అధి కంగా ఉన్నట్టు తెలిపారు. అటవీశాఖ అధికారుల వేధింపులు అధి కంగా ఉన్నట్టు తెలిపారు. రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించటం లేదని పేర్కొన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలను ప్రస్తావిస్తానని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, ఈర్ల విశ్వేశ్వర్‌రావు, సిందం శ్రీనివాస్, దోని శ్రీశైలం, చన్కపురి గణపతి, కాలిదాస్ మండల్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..
సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీ గోడెం నగేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌తోపాటు కార్యకర్తలు, అభిమానులు కేక్‌కట్ చేశారు. అనంతరం మొక్కలను నాటారు. అలాగే రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీనాయకులున్నారు.
అధిక నిధులు తీసుకువస్తా..
ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఎంపీగా గెలుపొంది శుక్రవారం మొదటి సారిగా జిల్లా కేంద్రానికి రావడంతో మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియో జకవర్గం తనకు 47వేలపైచిలుకు ఓట్లమెజార్టీ ఇచ్చిన నాయ కులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్య క్షుడు శ్రీనివాస్, కిరణ్, చక్రపాణి, తిరుపతి, ప్రణయ్, జయరాజ్, సురేష్, పెంటయ్య, గణేష్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.