Share News

Kumaram Bheem Asifabad: ‘ఇందిరమ్మ’ ఎవరికి దక్కేనో?

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:35 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 14: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం సుమారు పదేళ్లు నిరీక్షించిన పేదల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

 Kumaram Bheem Asifabad: ‘ఇందిరమ్మ’ ఎవరికి దక్కేనో?

- జిల్లాలో 1,54,141 దరఖాస్తులు

- గత సర్కారు హయాంలోనూ దరఖాస్తు చేసుకున్న పేదలు

- ఎట్టకేలకు ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 14: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం సుమారు పదేళ్లు నిరీక్షించిన పేదల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. సొంతింటికలను సాకారం చేసుకునేం దుకు అర్హులు సిద్ధమవుతున్నారు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భద్రాచలంలో ప్రారం భించారు. ఈ నేపథ్యంలో అర్హులైన పేదలు మళ్లీ కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు మార్గదర్శకాలను తెలుసుకుంటున్నారు. కొంతమంది మండల కార్యాల యాలకు వెళ్లి అధికారులను సంప్రదిస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు పొందలేకపోయిన నిరుపేదలు ‘ఇందిరమ్మ’ పథకం ద్వారానైనా సొంతింటి కలను నేరవేర్చుకోవాలని ఉబలాటపడుతున్నారు.

బీపీఎల్‌లో ఉంటేనే అర్హత..

ఇందిరమ్మ పథకంపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వహయాంలో వచ్చిన దరఖాస్తులను పరిగణ లోకి తీసుకొని పరిశీలిస్తారా? కొత్తగా మళ్లీ దరఖాస్తులు చేసుకో వాల్సి ఉంటుందా? అనేవిషయమై ఇప్పుడే తామేమి చెప్పలేమ న్నారు. కాగా 2023 అక్టోబరు నాటికి లక్షకు పైగా దరఖాస్తు చేసు కొన్నారు. తాజాగా ప్రభుత్వం అరు గ్యారంటీల పథకం ద్వారా ఇంది రమ్మ ఇళ్లకోసం 151141మంది దరఖాస్తులు చేసుకున్నారు. అర్హులైన వారినే ఈ పథకం ద్వారా ఎంపిక చేస్తామని సీఎం ప్రక టించిన నేపథ్యంలో అధికారులు సైతం ఆచితూచి వ్యవహరించే ధోరణితో ఉన్నారు. ఇందిరమ్మ స్కీంకు కూడా కలెక్టర్‌లే నోడల్‌ అధికారులుగా ఎంపికచేసే అవకాశం ఉందంటున్నారు. మండల పరిధిలో ఎంపీ డీవోల ఆధ్వర్యంలో, మున్సిపాలిటీల్లో పట్టణ ప్రణాళిక అధికారి, ఆర్‌ఐల ఆధ్వర్యంలో పరిశీలన చేయనున్నారు. సొంత స్థలం ఉందా? బీపీఎల్‌ పరిధిలో ఉన్నారా? లేదా? గ్రామంలోని ఓటు హక్కు ఉన్న ట్లు గుర్తింపు ఉందా? ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఎవరిది? తదితర వాటిని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

1,54,141 దరఖాస్తులు

ఇందిరమ్మ ఇళ్ల కోసం గత డిసెంబరు 28నుంచి జనవరి 6వరకు అయిదు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లాలో సొంతింటి కోసం 1,54,141కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. వీరిలో ఎంతమంది అర్హులో అధికా రులు గుర్తించాల్సి ఉంది. ఇంతవరకు బాగున్నా ఏటా నియోజక వర్గానికి 3,500చొప్పున ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో రెండు నియోజక వర్గాల్లో ఏటా ఏడువేల ఇళ్లు మంజూరు అవుతాయి. వచ్చినదరఖాస్తులు చూస్తే 1.50లక్షలకు పైగా ఉన్నాయి. వీరిలో కనీసం సగం మందే అర్హులనుకున్నా వీరందిరికీ రావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది.

ఫ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి..

- జ్యోతి, ఆసిఫాబాద్‌

సొంతిల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటు న్నాం. ఫ్యాన్సీ స్టోర్‌లో పనిచేస్తున్నాను. వచ్చిన వేతనంలో సగం ఇంటి కిరాయికే వెచ్చించాల్సి వస్తొంది. గత ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు పెట్టుకున్నా మంజూరు కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లుతోపాటు స్థలం కూడా కేటాయించాలి.

Updated Date - Mar 14 , 2024 | 11:35 PM