Share News

Kumaram Bheem Asifabad: నాణ్యతగల విద్యుత్‌ అందించేందుకు కృషి చేస్తాం

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:09 PM

కౌటాల, ఏప్రిల్‌ 27: రాష్ట్రంలోని వినియోగ దారులకు నాణ్యతగల కరెంటు అందించేం దుకు కృషిచేస్తున్నా మని ట్రాన్సుకో సీఎండీ(నార్తర్న్‌పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌) కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శనివారం కౌటాల మండల కేంద్రంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Kumaram Bheem Asifabad: నాణ్యతగల విద్యుత్‌ అందించేందుకు కృషి చేస్తాం

- ట్రోన్స్‌కో సీఎండీ కార్నాటి వరుణ్‌రెడ్డి

కౌటాల, ఏప్రిల్‌ 27: రాష్ట్రంలోని వినియోగ దారులకు నాణ్యతగల కరెంటు అందించేం దుకు కృషిచేస్తున్నా మని ట్రాన్సుకో సీఎండీ(నార్తర్న్‌పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌) కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శనివారం కౌటాల మండల కేంద్రంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడే విద్యుత్‌ సరఫరా యార్డ్‌లో ఉన్న జంపర్‌ల స్థితిని చూశారు. ఫీడర్ల వారీగా డిమాండ్‌, అంతరాయం తదితర సమస్యలు తెలుసుకు న్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ షెడ్‌ను తనిఖీ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌లో ఖచ్చింగా నాణ్యతగల మెటీరియల్‌ వాడాలన్నారు. రైతులకు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసే బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గట్లు సప్లై చేస్తున్నామని చెప్పారు. మారు మూల ప్రాంతాల్లో వ్యవసాయ సరఫరాకోసం ప్రత్యేకశ్రద్ధ పెట్టామన్నారు. వ్యవ సాయం కోసం రైతులు పెట్టుకున్న వ్యవసాయ కనెక్షన్లన్నీ వచ్చే జూన్‌ నాటికి వందశాతం అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. గాలివాన ఎఫెక్ట్‌ వల్ల విద్యుత్‌ స్తంభాలు విరగడంతో కరెంటు సరఫరాలో అంతరాయం కలుగుతోందని, విరిగినస్తంభాలు, తెగినతీగలు, కాలిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చుతున్నట్లు తెలిపారు. ఆయనవెంట టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఎస్సీ వాసు దేవ్‌, డీఈ నాగరాజు, ఏడీఈ రాజేశ్వర్‌, ఏఈలు రవీందర్‌, శ్రీనివాస్‌, సంతోష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:09 PM